ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 11.04.2025 శుక్రవారానికి సంబంధించినవి.
బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. వాహనయోగం ఉంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది.
ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మంచిది. ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది.
వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తి విషయాల్లో ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది.
సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. వ్యాపారపరంగా కొన్ని నిర్ణయాలు కలిసివస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు తొలగిపోతాయి.
కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్త పరిచయాల వల్ల విలువైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారపరంగా బాగుంటుంది.
బంధు మిత్రుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు వస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.
ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. మిత్రుల వల్ల సమస్యలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
రుణ ప్రయత్నాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. పనుల్లో అవరోధాలు తొలగిపోతాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. దూరప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది.
అన్నదమ్ములతో ఆస్తి గొడవలు రావచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారం బాగుంటుంది.
ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన పనులు వేగంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.
అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనవసరమైన వస్తువులకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి ప్రస్తావన వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.