Ugadi 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి జాతకం..!

By telugu news teamFirst Published Mar 28, 2022, 2:03 PM IST
Highlights

శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి  అభియోగములు భరించాల్సి వస్తుంది. చేయని నేరాలు మోపబడుతాయి. భూములు కొనుగోలు ప్రయత్నములు ఫలించును. బంధు మిత్రులతో అనుకూలం. 

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి 

కర్కాటకరాశి వారికి శుభకృత్  నామ సంవత్సరంలో ఆదాయం: 05 - వ్యయం: 05

రాజపూజ్యం- 05 - అవమానం - 02

కర్కాటకరాశి వారికి  శుభకృత్ నామ సంవత్సరంలో 

* గురుగ్రహ ఫలితాలు :- అభియోగములు భరించాల్సి వస్తుంది. చేయని నేరాలు మోపబడుతాయి. భూములు కొనుగోలు ప్రయత్నములు ఫలించును. బంధు మిత్రులతో అనుకూలం. స్థిరాస్తి అభూవృద్ధి కలుగుతుంది. వాహన సౌఖ్యం. భోగ భాగ్యములు, నూతన వ్యాపార ప్రయత్నములు ఫలించును. కులాచారం పాటిస్తారు. 
 
* శని "దేవుని" గ్రహ ఫలితాలు:- ఏప్రిల్ 29 నుండి జులై 12 వరకు అష్టమ శని అతిచారంతో 75 రోజులు సాగే గ్రహస్థితి వలన అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు అవసరం.  ప్రభావం వలన స్థాన చలనములు. ఉద్యోగ మార్పులు. ఇంటిలోని జీవన విధానంలో లోటు ఏర్పడుతుంది. దూర ప్రాంత నివాసం. వృత్తి ఉద్యోగాలలో సహనం అవసరం, కోపం ఎంత తగ్గించుకుంటే అంతా లాభపడతారు. రావలసిన బాకీలు వసూలు చేయుటలో తొందర పడరాదు. యుక్తి ప్రధానం. శాంతమే ప్రతీ పనికి పరిష్కార మార్గం చూపిస్తుంది.    

* రాహువు ఫలితాలు:- అనుకోని కలహాలు. విలువైన వస్తు నష్టం. వృత్తి వ్యాపారాభివృద్ది కలుగుతుంది. ధన దాన్యలాభం కలుగుతుంది. బంధు మిత్రులతో విందు భోజనాలు. వ్యాపారస్తులకు సరికొత్త పద్దతిలో లాభాలు కనబడుతాయి.    

* కేతువు ఫలితాలు:- సంతాన మూలకంగా కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. చిత్త చాంచల్యం. స్థిరాస్తులు తనఖాలు లేదా విక్రయించ వలసివచ్చును. 


ప్రతి విషయంలో 60 శాతం అనుకూలం 40 శాతం ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. 

పాకెట్ రక్ష యంత్రాన్ని ఎల్లప్పుడూ దగ్గర పెట్టుకోండి. 

ఆరోగ్య విషయంలో, వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి. 

అప్పుగా ఎవ్వరికి ధనాన్ని ఇవ్వకండి. 

వ్యాపారాలలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పడవలెను. 

వ్యవసాయ దారులకు రెండవ పంట కలసివచ్చును. 

ఉద్యోగస్తులకు స్థాన చలనం, అధికారులను మెప్పించి కోరుకున్న చోటుకు బదిలీ చేయించుకుంటారు. 

కంఠానికి సంబంధించిన ఆనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. 

జాయింట్ వ్యాపారాలలో విభేదాలు చోటు చేసుకుంటాయి. 

ముఖ్యమైన వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు అడుగులు వేయగలరు. 

తరచూ ఉద్రిక్తతకు సిద్దం అవుతారు. 

విద్యార్ధులు ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది.  

స్వయంకృతాపరాధం చేసుకోకండి. 

రాజకీయ నాయకులు మౌనంగా ఉంటే మంచిది. కొంత గడ్డుకాలం. మాటలు అదుపుగా, పొదుపుగా వాడుకోవాలి. భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. బంధు విరోధం తగదు. మీ పై ప్రత్యేక నిఘా ఉంటుంది. దైవానుగ్రహం వలన మి ఆంచానాలు ఫలిస్తాయి. పదవీ ప్రాప్తి. 

జులై నెల నుంచి ఖర్చు విషయంలో అప్రమత్తనంగా ఉండాలి. 

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు..   ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు..  మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య 

click me!