జాతకం.. నాకు వ్యాపారం కలిసి వస్తుందా..? లేదా ఉద్యోగమా?

By ramya NFirst Published Feb 11, 2019, 9:51 AM IST
Highlights

మాకు పంపిన కొందరి జాతక వివరాలు ఇక్కడ ఉన్నాయి చూసుకోగలరు

12.12.1992( మణికంఠ)

1. వివాహం ఎప్పుడు అవుతుంది? ఫ్యూచర్‌ ఎలా ఉంటుంది?

ఉగాది నుంచి వివాహానికి అనుకూల సమయం. అప్పినుంచి వెతకటం ప్రారంభిస్తే వెంటనే సంబంధాలు కుదురుతాయి. ఫ్యూచర్‌ బావుంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. చదువుకోదలచుకుంటే పిహెచ్‌.డి లాిం ఉన్నత విద్యల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది.

మీరు నిరంతరం ఏదో ఒక దైవిక ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం మంచిది.

 కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానాలు : 1. కందిపప్పు / దానిమ్మపళ్ళు / కర్జూరం, 2. నూనె, వండుకునేవారికి వంటకు, దేవాలయంలో దీపారాధనకు దానం చేయాలి. 3. ఇడ్లీ, వడ 4. గోధుమరవ్వ/ గోధుమ పిండి/ గోధుమరొట్టెలు. నిరంతరం దానం చేయడం మంచిది.

2. జూన్‌ 28 1984 ( కుమార్)

ఉద్యోగమా ? వ్యాపారమా? ఏది అనుకూలం?

17 జూన్‌ 2019 తర్వాత  నుంచి 3 సం||ల పాటు మంచి సమయం ఉంటుంది. జీవితంలో సిెల్‌ కావడానికి ఉత్తమమైన సమయం. ఉద్యోగం చేయడమే మంచిది. వ్యాపారం అంత అనుకూలం కాదు.

వీరికి ఎక్కువ ఖర్చులు ఉంటాయి కాబట్టి ముందుగానే వీరు దాన ధర్మాలు చేయడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే అనవసర ఖర్చులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి.

జపం :  శ్రీరాజమాతంగ్యై నమః; హరహర శంకర జయజయ శంకర.

దానాలు : 1. కందిపప్పు / దానిమ్మపళ్ళు / కర్జూరం, 2. నూనె, వండుకునేవారికి వంటకు, దేవాలయంలో దీపారాధనకు దానం చేయాలి. 3. కూరగాయలు 4. గోధుమరవ్వ/ గోధుమ పిండి/ గోధుమరొట్టెలు. నిరంతరం దానం చేయడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!