నేడు వసంత పంచమి

By ramya NFirst Published Feb 10, 2019, 7:55 AM IST
Highlights

సరస్వతి అహింసకు ప్రతీక. అనగా ఈమె చేతిలో ఏ ఆయుధాలు ధరించి ఉండదు. ఈమే జ్ఞానానికి ప్రతీక మాత్రమే. సరస్వతీ దేవి కూడా ఒక కాలు నిలువుగాను దానిమీద అడ్డంగా ఉంచుకొని ఆమె ఒక చేతిలో వీణ ధరించి మరో చేతిలో పుస్తకం పట్టుకొని కనబడుతుంది.

మకర సంక్రాంతికి తరువాత ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. చెట్లు చిగురించటం, పూలు పూయడం వింవి కనిపిస్తాయి. దక్షిణాయం అంతా ప్రకృతికి కాలాలు అనుగుణంగా దేవరాధనలు నోములు వ్రతాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాయణం ప్రారంభం అయిన తరువాత నోములు వ్రతాల ప్రాధాన్యత అంత ఎక్కువగా మనకు కనిపించదు. మాఘాది పంచకాలు అనగా మాఘమాసం, ఫాల్గుణమాసం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం ఈ అయిదు మాసాలు

శీతాకాలం యొక్క తీవ్రత కూడా కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. శీతాకాలంలో ఎక్కువగా బాధించే జలుబు, దగ్గులు క్రమంగా కాస్త వెనకపడుతూ ఉంటాయి. వేసవికాలం అప్పుడప్పుడే ప్రారంభం కావడం వలన సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టే సమయంగా ఈ వసంతపంచమి మనకు కనబడుతుంది.

సరస్వతి అహింసకు ప్రతీక. అనగా ఈమె చేతిలో ఏ ఆయుధాలు ధరించి ఉండదు. ఈమే జ్ఞానానికి ప్రతీక మాత్రమే. సరస్వతీ దేవి కూడా ఒక కాలు నిలువుగాను దానిమీద అడ్డంగా ఉంచుకొని ఆమె ఒక చేతిలో వీణ ధరించి మరో చేతిలో పుస్తకం పట్టుకొని కనబడుతుంది. తెల్లి పద్మంపై నిలబడి, తెల్లి దుస్తులను ధరించి ఉంటుంది. తెల్ల్టి పువ్వులు ధరించి ఉంటుంది. తెల్లి జపమాల ధరిస్తుంది. వీణ కూడా తెలుపు రంగులో ఉంటుంది. తెలుపు శాంతికి, పవిత్రతకు గుర్తు. తెలుపు జ్ఞానానికి ప్రతీక.

తెలుపు అజ్ఞానాన్ని అంధకారాన్ని కూడా నిరోధిస్తుంది. ఏదైనా ఒక వస్తువుపైన తెలుపు కాంతి ప్రసరిస్తేనే ఆ వస్తువు యొక్క రూపు రేఖలు కనబడతాయి. ఆ వస్తువుకు చైతన్యం వస్తుంది. సూర్యకిరణం కూడా తెలుపు రంగులోనే ఉంటుంది. ఉదయం సూర్యకిరణాలు భూమిమీద పడినంతమాత్రం చేతనే పద్మం వికసిస్తుది. ఆధ్యాత్మిక విద్యలకు లౌకిక విద్యలకు కూడా సరస్వతిని ప్రతీకగా చెపుతారు. తెలుపు జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.

సరసతి అనగా కదులుట అని అర్థం. అన్ని రకాల కదలికలకు మూల స్వరూపం జ్ఞానమే. అందుకే సరస్వతి జ్ఞాన స్వరూపిణి. సూర్యునిలోని వెలుగునంతా ఒక్కచోట ముద్దచేస్తే ఆ కనిపించే రూపం సరస్వతిగా మన ఉపాసకుల భావన. అందుకే ఈమెను సర్వశుక్లగా, శ్వేతాంభరదారిణిగా ఈమెను కొలుస్తాం. శరీరానికి ధరించిన వస్త్రాభరణాదులన్నీ తెలుపు రంగులో ఉండడం మనకు జ్ఞానానికి సంకేతంగా చూపించేవే. ఏ వస్తువుపైనైనా వెలుగు పడితే అది మనకు కనిపిస్తుంది. అంటే ఆ వస్తు పరిజ్ఞానం మనకు తెలుస్తుంది. 'తెలుపు' తెలుపుతుంది.

సూర్యుని కిరణం తెలుపు రంగులో ఉంటుంది. శక్తికి రూపం ఇస్తే అది సరస్వతిగా మారినది. జ్ఞానం ఎక్కడ ఉంటుందో సరస్వతి అక్కడ ఉంటుంది. శ్రీ అనగా కాళి లక్ష్మీ సరస్వతి అని అర్థం. శక్తి నుంచే ఈ మూడు ప్టుటాయని అర్థం. శక్తి ఎక్కడ ఉందో అక్కడ కాంతి, రూపం, వెలుగు జ్ఞానం అన్నీ ఉంటాయి. ఇవి అన్నీ సూర్యునివలనే సాధ్యం. కావున  సూర్యుడే అన్నీ మూలం. సూర్యుణ్ణి ఉపాసిస్తేనే అన్నీ వస్తాయి. శ్రీ పంచమి కూడా శక్తికి సంకేతమైనదే.

click me!