ఎవరి రాశి తత్త్వానికి అనుగుణంగా ఆ రాశివారు ఆ శక్తి స్వరూపాలను ఉపాసిస్తే జీవితంలో సాఫల్యతను సాధించగలుగుతారు.
మనలో ఉన్న చైతన్యమే విశ్వంలోనూ ఉన్నది. కాని ఎవరై చైతన్యాన్ని వారు గుర్తించక తమకు ఏదో లేదని, తెలియదని, తాము కొన్ని పనులు చేయలేమని ఎవరివారు నిరాశపడుతూ ఉంటారు. మనిషికి నిరాశ అనేది మంచిది కాదు. తమ శక్తికి విశ్వశక్తిని తోడు చేసుకోవడం వల్ల చేసే పనుల్లో జయం కలుగుతుంది. ఎవరైనా తక్కువ శ్రమతో ఎక్కువ పనులు, ఎక్కువ లాభాలు కావాలని కోరుకుటారు. అవి సానుకూలం కావాలంటే విశ్వశక్తి తమశక్తిగా మారితే అన్ని పనులు అందరూ సానుకూలంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ అన్ని దేవతలను ఆరాధించడం సాధ్యం కాదు. ఎవరి రాశి తత్త్వానికి అనుగుణంగా ఆ రాశివారు ఆ శక్తి స్వరూపాలను ఉపాసిస్తే జీవితంలో సాఫల్యతను సాధించగలుగుతారు. ఏ రాశివారికి ఏ ఆరాధన చేస్తే అనుకూలంగా ఉంటుందో ఇక్కడ చెప్పడం జరిగింది.
మేషం : వీరు సూర్య నమస్కారాలు చేయడం, సూర్యమండల స్తోత్రం చదవడం, సూర్యాష్టకం పఠించడం, ఆదిత్య హృదయస్తోత్రం చదవడం, దత్తాత్రేయస్వామి, సాయిబాబా, రాఘవేంద్రస్వామిని పూజించటం మంచిది.
undefined
వృషభం : వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ఏకాదశిరోజు ఉపవాసం ఉండటం, విష్ణువు ఆరాధన, అలాగే సోమవారాలు శివునికి అభిషేకం, శివారాధన చేయడం మంచిది.
మిథునం : వీరికి లక్ష్మీ అష్టోత్తర పారాయణం, లక్ష్మీ పూజ, శుక్రవారాలు ఉపవాసం ఉండడం, శివునికి అభిషేకం, శివారాధన చేయడం మంచిది.
కర్కాటకం : వీరికి నరసింహస్వామి ఆరాధన, అయ్యప్పస్వామి పూజలు చేయడం, చేయించడం, మంచిది. దక్షిణామూర్తి ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ దేవాలయాల అభివృద్ధికి సహకరించడం.
సింహం : దత్తాత్రేయస్తోత్ర పారాయణ, దత్తాత్రేయ జపం, మంగళవారాలు, గురువారాలు ఉపవాసం ఉండడం, సుబ్రహ్మణ్య ఆరాధన, అయ్యప్పస్వామి పూజలు చేయడం మంచిది.
కన్య : హనుమత్ ఆరాధన, ఆంజనేయస్వామి ప్రదిక్షణలు, లక్ష్మీపూజ, లక్ష్మీ అష్టోత్తర నామ పారాయణం, లక్ష్మీపూజ ఉపకరిస్తాయి, లలితాసహస్రనామ పారాయణ చేయడం మంచిది.
తుల : శివాభిషేకం, శివరాత్రి పూజ ఉపవాసాలు, హనుమత్ ఆరాధన, విష్ణుసహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర పారాయణం, హయగ్రీవ ఉపాసన చేయడం మంచిది.
వృశ్చికం : దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, గురువారం ఉపవాసాలు, లలితా సహస్రనామ పారాయణలు చేయించడం, గౌరీ స్తోత్రాలు, గౌరీ పూజలు చేయడం మంచిది.
ధనుస్సు : నరసింహస్వామి ఆరాధన, దుర్గాసప్తశ్లోకీ పారాయణ, సూర్య నమస్కారాలు చేయడం, సూర్యమండల స్తోత్రం చదవడం, సూర్యాష్టకం పఠించడం, ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం, సూర్యునికి ఉదయం పూట అర్ఘ్యాలు వదిలి పెట్టడం మంచిది.
మకరం : లక్ష్మీపూజ, లక్ష్మీ అష్టోత్తర నామాలు, లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, హయగ్రీవ ఉపాసన చేసుకోవడం మంచిది.
కుంభం : విష్ణుసహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తర పారాయణం, లలితాసహస్రనామ పారాయణ ఏకాదశిరోజు ఉపవాసం ఉండడం, మంచిది.
మీనం : లలితాసహస్రనామ పారాయణ, గౌరీదేవి, దేవీ స్తోత్రపారాయణలు, దుర్గాసప్తశ్లోకీ పారాయణం, నరసింహస్వామి ఆరాధన చేయడం మంచిది.
డా.ఎస్.ప్రతిభ