13నవంబర్ 2018 మంగళవారం రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Nov 13, 2018, 9:25 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సామాజిక అనుబంధాలు తగ్గుతాయి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. పరస్పర సహకారాలు లోపిస్తాయి. గౌరవం కోసం ఆరాట పడతారు. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు జాగ్రత్త పడడం మంచిది. లోపాలు ఉండే సూచనలు. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీల్లో గెలుపు ఉంటాయి. శత్రువులపై విజయానికి ప్రయత్నిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సృజనాత్మకతను కోల్పోతారు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సంతాన సమస్యలు పెరుగుతాయి. మానసిక అలజడి, భయం ఉంటాయి. పరిపాలన సమర్ధతత తగ్గిపోతుంది.   విద్యార్థులు ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. శ్రీ హయగ్రీవాయ నమః జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంఘంలో గౌరవం తగ్గుతుంది. సౌకర్యాలు ఒత్తిడికి గురి చేస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. విందుభోజనాలపై ఆసక్తి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అన్ని పనుల్లో జాగ్రత్తలు అవసరం. క్రీం అచ్యుతానంత గోవింద మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పరాక్రమం పెరుగుతుంది. అధికారులతో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. పరామర్శలు ఉంటాయి. చిత్త చాంచల్యం తగ్గుతుంది. పనుల్లో సౌలభ్యం లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మాటల్లో కఠినత పెరుగుతుంది. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు పనికిరావు. వాగ్దానాల వల్ల ఇబ్బందికి గురౌతారు. కుటుంబంలో కష్టాలకు సూచన. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అధికారులతో అనుకూలత పెంచుకోవాలి. విష్ణుసహస్రనామ పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఉద్యోగంలో ఉన్నతి పొందే సూచనలు. తరచు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. పట్టుదలతో కార్యసాధన చేయాలి. అభిరుచులు మారుతూ ఉంటాయి. శ్రీరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనవసర ఖర్చులు ఉంటాయి. ఉద్యోగంలో జాగ్రత్తలు అవసరం. ఉన్న స్థలం నుంచి వేరే చోికి మారే సూచనలు ఉన్నాయి. విశ్రాంతికై ఆరాట పడతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చిత్త చాంచల్యం ఉంటుంది. పాదాల నొప్పులు ఉంటాయి. పరాధీనత. శ్రీరామ జయరామజయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.  కళాకారులకు కాస్త ఒత్తిడితో అనుకూల సమయం. పెద్దవారితో సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. అన్ని విధాల లాభాలను సంపాదించుకుటాంరు. ఓం నమశ్శివాయ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో తోివారు సహాయ పడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు లాభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు అనుకూలిస్తాయి. తృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విద్యార్థులకు అధిక శ్రమ ఒత్తిడి ఉంటాయి. ఫలితాలు ఆశించినంతగా ఉండవు. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది.    ధనమార్గం వైపు ఆలోచనలు వెళుతాయి. అన్ని పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ఓం నమశ్శివాయ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనుకోని ఇబ్బందులు వస్తాయి. రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఊహించని పనుల్లో ఆటంకాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆహారంలో సమయ పాలన అవసరం. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. క్రీం అచ్యుతానంత గోవింద జపం మంచిఫలితాలనిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!