పూర్వజన్మ.. జోతిష్యం ఏమి చెబుతోంది

By ramya neerukondaFirst Published Jan 30, 2019, 1:51 PM IST
Highlights

పుట్టడానికి గతజన్మల్లో తీరని కోర్కెలే కారణం అవుతున్నాయి. ఒక్కో జన్మలో ఒక్కో విధమైన కోరికవైపు మనసు లాగుతుంది. ఒకి తీరగానే మళ్ళీ ఇంకోటి . వీటి కి అంతు అనేది ఉండదు.

పుట్టడానికి గతజన్మల్లో తీరని కోర్కెలే కారణం అవుతున్నాయి. ఒక్కో జన్మలో ఒక్కో విధమైన కోరికవైపు మనసు లాగుతుంది. ఒకి తీరగానే మళ్ళీ ఇంకోటి . వీటి కి అంతు అనేది ఉండదు. 'మొక్కై వంగనిది మానై వంగుతుందా' అనే సామెత ప్రకారం  చిన్నతనం నుండి కోరికలు అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఆ భావననుంచి బయటపడాలి. సమాజ శ్రేయస్సుకు కోసం పాటుపడే వాళ్ళను చూసి అలా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించాలి. అనవసర  పోటీలను ఎటువింవారితో పెట్టకోకూడదు.

వ్యక్తి తాను ఉన్నత లక్ష్యాలను అలవరచుకుంటూ సమాజానికి ఉన్నత విలువలు అందించడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ప్రకృతి తనకు అడగకుండానే గాలి, వెలుతురు, ఉష్ణం, నీరు అన్నీ అందిస్తున్నందునకు కృతజ్ఞతగా ఉండడం నేర్చుకోవాలి. సమాజంలో పది కాలాలలపాటు నిలిచే పనులు చేయాలని లక్ష్యం పెట్టుకోవాలి. జ్యోతిషం ద్వారా తాను ఉన్న జీవితం నుంచి ఉన్నతమైన జీవితానికి అభివృద్ధివైపు ఎలా ప్రయాణించాలో తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవరిస్తూ ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాన్ని సముపార్జించి సమయాన్ని మిగిల్చుకునే ప్రయత్నం ఎలా చేయాలో జ్యోతిషం ద్వారా తెలుసుకోవచ్చు.

దీనినే కళాత్మకమైన (ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌) జీవితం అంటా రు. సమయం బావున్నప్పుడు మంచి పనులు చేస్తూ ఎదుగుతూ ఉండమని, సరియైన సమయం లేన్నప్పుడు ఉన్న స్థితిలో ఉండాలని అక్కడినుంచి కిందపడకుండా చూడాలని జ్యోతిషం నిర్దేశిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా కష్టపడినా వారి వచ్చే ఆదాయంలో తేడాలను జ్యోతిషం మాత్రమే గుర్తిస్తుంది.  అందుకే జ్యోతిషం ద్వారా జీవనలక్ష్యాలను సాధించడం సులభతరం అవుతుంది.

మనసును అదుపులో పెట్టుకుంటే అన్ని పనులు సాధ్యం అవుతాయని జ్యోతిషం చెపుతుంది. మనసు కర్మను అనుసరించి పనిచేస్తుంది.  తనకు లేదు అనే భావన రోగానికి కారణం అవుతుంది. కాబ్టి ఆ భావన నుంచి బయట పడాలి. తనకు ఉన్నద్లాోం సంతృప్తి పడే అలవాటు చేసుకోవాలి. లేదు అనడం ఒక రోగం. తనకు ఉన్నది అనుకోవడం ఒక రకమైన పాజివ్‌. తనకు మాత్రమే ఉన్నది అనుకోవడం అహంకారానికి దారి తీస్తుంది. అహంకారం మరల రోగానికి హేతువు అవుతుంది.

మనసును ఎప్పుడూ విశ్వచైతన్యానికి దగ్గరగా ఉంచాలి. దాని వలన తనలో కూడా ఎప్పుడూ చైతన్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ చైతన్య ప్రవాహం వల్ల భౌతిక భావనలను వరుసగా వదులుతూ ఉంటే ఆధ్యాత్మికంగా ఒక్కో మెట్టు ఎక్కుతారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి ఎదిగిన వారు అహంకారంతో ఉన్నారంటే మళ్లీ కిందికి పడిపోక తప్పదు అనే విషయాన్ని కూడా అందరికీ తెలిసినదే.  ఒక స్థాయికి ఎదిగినవారు మళ్ళీ తిరిగి క్రిందికి వెళ్ళకుండా ప్రయత్నం చేయడం జ్యోతిషం ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. గతం గురించిన బాధ ఉండదు భవిష్యత్తును గురించిన ఆలోచన ఉండకూదు. ఈ విషయాన్ని వివేక చూడమణిలో చెప్పారు.

గడిచిపోయిన విషయాలు గుర్తుంచుకోకుండా, భవిష్యత్తును గూర్చి ఆలోచించక ఈ గుణదోషాలైన ప్రపంచంలో ఎల్లప్పుడూ సమదృష్టితో ఉండాలి.సజ్జనులచేత ఈ శరీరం సత్కరింపబడినా, దుర్జనుల చేత తిరస్కరింపబడినా రెండు థల లోను ఎవరైతే సమభావంతో ఉంటా రో వారే జీవన్ముక్తులు. ఈ స్థితికి చేరుకోవాలని జ్యోతిషం తెలియజెప్తుంది.

అందరి సంకల్పాలు తన సంకల్పాలుగా చేసుకోవాలి. తనకంటూ ప్రత్యేకంగా ఏ సంకల్పమూ ఉండకూడదు. అందరిలో తాను ఉండాలి. ఎక్కడా ఉన్నట్టుగా ఉండకూడదు. అన్నిచోట్ల మనస్సు పెట్టి ఆనందిస్తూ ఉండాలి. మానసికంగా అందరి బాధలు తాను అనుభవించడం, విశ్వంతో ఎప్పుడూ మమేకమైపోవడం. ఇలా చేస్తూ ఉండడం వలన తనకు ఒకదానిపైన ఇష్టం అయిష్టం ఏదీ ఉండదు.

తను భూమిమీదకు వచ్చినందుకు భగవంతుడు ఇచ్చిన పనులు పూర్తి చేసుకుంటూ తన సమయం వచ్చినపుడు ఈ శరీరాన్ని నిష్క్రమిస్తాడు. ఇలా ఉండగలగాలి అనే విషయం జ్యోతిషం చెప్తుంది. వీటన్నికీ మనస్సే కారణం అవుతుంది. ఎంతసేపూ అన్నీ మనస్సు చుట్టూనే తిరుగుతూ ఉంటా యి. మనస్సును అదుపులో ఉంచుకుంటే ఏ పని చేయడానికైనా సాధ్యమే అన్న విషయాన్ని తెలుసుకోవాలి.

మనస్సు ఎంత ఎంతగా అంతర్ముఖం అవుతుందో అంతగా బాహ్య వాసనలు విడిచి పెడతారు. వాసనలు నిశ్శేషంగా ముక్తాలైనప్పుడు ప్రతిబంధరహితమై ఆత్మానుభవం కలుగడం మొదలు పెడుతుంది.

మానసికమైన మార్పులు పొందడానికి, ఆలోచనల్లో మార్పులు రావడానికి భారతీయ విజ్ఞానంలో, ఆచార వ్యవహారాల్లో అనేక విధాలైన ప్రక్రియలున్నాయి. నిద్ర లేచినప్పి నుండి తిరిగి నిద్రించే విధానం వరకు ఒక ప్రత్యేకమైన సూత్రబద్ధమైన వ్యవస్థను భారతీయులు అలవరచారు.

డా.ఎస్.ప్రతిభ

click me!