ఆహారం పై మనసు ప్రభావం

By ramya neerukondaFirst Published Jan 29, 2019, 3:00 PM IST
Highlights

మనం తినేఆహారం ఎంత వర్ణ రంజితంగా రంగురంగులుగా ఎంత వైవిధ్యభరితంగా ఉంటే అంత ప్రయోజనకరమని పోషకాహార నిపుణులంతా చెపుతున్నారు. రకరకాల రంగు రంగుల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం కింకి, ఒంటి కి కూడా వంటివిదు చేస్తుంది.

సరియైన ఆరోగ్యం కోసం ఆహారాన్ని సరిగా తీసుకోవలసిన అవసరం ఉంది. శారీరక ఎదుగుదలకు ఋతు సంబంధమైన, జాతక సంబంధమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఇబ్బందులు లేని జీవిత విధానం ఉంటుంది. ఆకర్షణలతో రుచులకు లోబడి ఆహారాన్ని స్వీకరించడం ద్వారా ఇబ్బందికరమైన, అనారోగ్యకరమైన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. అదేవిధంగా మనస్సులో సరియైన, లోకోపకారమైన ఆలోచనలను ఆహారంగా స్వీకరించినవాడు ఈ లోకాన్ని జయించగలిగే విధానం ఉంటుంది. అక్కడా వేరు వేరు రుచులపై దృష్టి పెట్టిన వాడు క్రమంగా మనోరోగాలను పొంది ఇబ్బందులకు గురి అవుతాడు. స్వస్థత పొందాలంటే తనలో తాను ఉండాలి. తనలో తాను ఉండేది మనస్సు మాత్రమే. మనస్సు నిర్ణయం తీసుకున్నప్పుడు శరీరం దానిని పాటి స్తుంది. కాబట్టి ఆహారాది విషయాలలోనూ, ఆలోచనల్లోనూ మనస్సుదే కీలకమైన పాత్ర.

ఆహారంలోనే ''ఆరోగ్యానికి హరివిల్లు : మనం తినేఆహారం ఎంత వర్ణ రంజితంగా రంగురంగులుగా ఎంత వైవిధ్యభరితంగా ఉంటే అంత ప్రయోజనకరమని పోషకాహార నిపుణులంతా చెపుతున్నారు. రకరకాల రంగు రంగుల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం కింకి, ఒంటి కి కూడా వంటివిదు చేస్తుంది. రంగు రంగుల వృక్షసంబంధ ఆహారంలో కీలక పోషకాలైన కెరొటి నాయిడ్లు, బయో లావనాయిడ్లు వంటివి ఉంటాయి. ఇవి మన శరీరంలో విశృంఖల కణాల (ఫ్రీరాడికల్స్‌) దాడికి అడ్డుకట్ట వేస్తాయి. ముఖ్యంగా కెరొటి నాయడ్లలో భాగమైన లైకోపేజు, రూటి స్సు, బీ కెలోటిస్ వంటివి వయసుతోపాటు శరీరంలో కణజాలంలో వచ్చే క్షీణతను నివారించే ప్రయత్నం చేస్తాయి.

టమోటా(శుక్రుడు), పుచ్చకాయ(రవి), ద్రాక్ష (శుక్రుడు), అంజీరా (రవి, గురులు) వంటివి ఎర్రి పండ్లలో ఉండే లైకోపేస్‌ కణాల్లో ఒత్తిడిని తగ్గిచ్చే యాంటీ యాక్సిడెంటుగా పనిచేస్తుంది. రోగనిరోధకశక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. మామిడి (గురుడు), బొబ్బాయి (రవి), క్యారెట్లు (కుజుడు,రవి), చిలకడదుంప (కుజుడు,గురుడు) వంటివి పసుపు, నారింజరంగుల్లో ఉండే పండ్లు కూరగాయల్లో బీ కెలోటిస్ అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. విటమిన్‌ 'ఎ' లోపం రాకుండానే కాదు క్యానర్స్‌ నివారణకు కూడా ఉపయోగపడుతుంది. ఇది మసాలా దినుసులు(రాహువు), పసుపు(గురుడు), గ్రీన్‌ టీ (బుధుడు), బత్తాయి(గురుడు), నారింజ (శుక్రుడు) వంటివి పండ్లు దుంపలు, కూరగాయలు అధికంగా ఉండే బయోఫ్లావరాయిడ్లు, గుండెజబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా రక్తనాళాలు ఆరోగ్యకరంగా ఉండేలా చూస్తాయి. ఇలా సహజంగా లభ్యమయ్యే అన్ని రంగుల పదార్థాలకు ఏదో ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఎన్ని రంగుల పదార్థాలు తింటే అంత మంచిది.

''అద్యతే అత్తిచ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి'' - అరి తైత్తిరీయ ఉపనిషద్వాక్యం. మితంగా తింటే తినబడుతుంది. మితం దాటి తే మననే తింటుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!