ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పదిమందిలో గౌరవం పెరుగుతుంది. నూతనపరిచయాలు అభివృద్ధిచెందుతాయి. స్నేహితులతో ఆనందం కలుగుతుంది. వ్యాపారస్తులు ఆలోచనతో పనిచేస్తారు. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శత్రువులతో ఆటంకాలు ఏర్పడతాయి. రుణసంబంధాల వల్ల ఇబ్బందులు. పోటీల్లో ఒత్తిడితో గెలుపు సాధిస్తారు. అనారోగ్య భావన ఉంటుంది. పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. శారీరక బలం తగ్గుతుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పనుల్లో ప్రణాళిక ఉంటుంది. సంతానవర్గం వల్ల సంతోషం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఆత్మీయానురాగాలు వృద్ధి చెందుతాయి. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనవసర ఇబ్బందులు పడతారు. ఆహారంలో సమయ పాలన అవసరం. తల్లివిషయంలో జాగ్రత్త పాటి ంచాలి. అభివృద్ధి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పెద్దవారి సహాయ సహకారాలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్ వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. రచనలపై ఆసక్తి తగ్గుతుంది. వాటి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి సారిస్తారు. పరామర్శలు చేస్తారు. సమీప వ్యక్తులతో ఇబ్బందులు వస్తాయి. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. వాగ్దానాలు నెరవేరుస్తారు. వక్చాతుర్యం పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. నిల్వ ధనంపై ఆసక్తి పెరుగుతుంది. దృష్టి నివారణలు జరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికం. కార్య సాధనలో పట్టుదల అవసరం. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పులు ఉంటాయి . కష్ట సుఖాలు సమానంగా ఉంటాయి . గుర్తింపుకోసం ఆరాట పడతారు. ఉద్యోగంలో బదిలీలకు అవకాశం. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విశ్రాంతికై ఆలోచిస్తారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. పాదాల నొప్పులు. అనవసర ప్రయాణాలపై దృష్టి. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతిలోపం ఉంటుంది. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సమిష్టి ఆదాయాలు లభిస్తాయి. కళానైపుణ్యం పెరుగుతుంది. ఆదర్శవంతమైన జీవితం కొనసాగిస్తారు. ఇతరులపై ఆధారపడతారు. విద్యార్థులకు అనుకూల సమయం. ఆశయ సాధన ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. అధికారులతో అసౌకర్యం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు. ఉద్యోగంలో ఒత్తిడిశాతం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. సజ్జన సాంగత్యం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు . ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఊహించని ఇబ్బందులు పడతారు. అనుకోని ఖర్చులు చేస్తారు. లావాదేవీల్లో జాగ్రత్తలు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. క్రయ విక్రయాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఒడిదొడుకులు వచ్చే సూచన. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
డా.ఎస్ ప్రతిభ