సాముద్రికం - సూర్యరేఖ

Published : Sep 20, 2018, 04:31 PM ISTUpdated : Sep 20, 2018, 04:33 PM IST
సాముద్రికం - సూర్యరేఖ

సారాంశం

ఎంతో కీర్తిప్రతిష్టలు ఉన్న వ్యక్తులకు తప్ప వేరే వ్యక్తులకు కనబడటం మన అనుభవానికి రాదు. ఈ రేఖ భాగ్యరేఖ స్థానమునకు పక్కనుండి బయలుదేరుట ఆనవాయితీ అని శాస్త్రజ్ఞులు చెప్పినారు.

మణికట్టు రేఖకు సమీపానగల అరచేతి చివరి భాగంలో లేదా అరచేయి కింది భాగంలో ఎక్కడ పుట్టిన  రేఖ అయిన రవిస్థానంలో ముగింపబడిన అది సూర్య రేఖగా భావింపబడుతుంది. చాలామందిలో ఈ ఉపప్రధాన ఊర్ధ్వరేఖలు కనబడుట తక్కువే. ఐనప్పికీ ఇంకనూ ఈ రవిరేఖ కనబడటం మరీ తక్కువ. ఈ రేఖ నిర్దోషంగా ఉన్న ఎంతో కీర్తిప్రతిష్టలు ఉన్న వ్యక్తులకు తప్ప వేరే వ్యక్తులకు కనబడటం మన అనుభవానికి రాదు. ఈ రేఖ భాగ్యరేఖ స్థానమునకు పక్కనుండి బయలుదేరుట ఆనవాయితీ అని శాస్త్రజ్ఞులు చెప్పినారు. కొంతమంది వ్యక్తులో భాగ్యరేఖ లేకుండా సూర్యరేఖ మాత్రమే ఉంటే అది ఉభయాత్మక ఊర్ధ్వరేఖగా పనిచేస్తుంది. అంటే ధనరేఖ కారకాలు ఇది తనదిగా చేసుకుంటుంది. ఈ రేఖ ఉండవలెనను నియమం లేకున్నను ఉంటే మట్టుకు వ్యక్తి అత్యంత కీర్తిని పొందునని మంచి పదవులు, అధికారం, శక్తియుక్తులు, రాజకీయంగా అందెవేసిన వారు కాగలరని చెప్పవచ్చును. నిజానికి రవి స్థానంలో గల ఒకి రెండు స్థాయి రేఖలే నిజమైన రవి రేఖలని అనవచ్చు. దానికి శక్తి, యుక్తులు సమకూర్చానికి బండి వెనక గల గాలి తోడ్పాటును స్థాయీ సూర్య రేఖకు ఈ సూర్యరేఖ తోడ్పాటు మాత్రమే అందించగలదు. ఈ రేఖ లేదనే బాధ ఎవరికీ ఉండరాదు. రవిస్థానంలో గల స్థాయీరేఖలే ఉద్యోగమునకు మంచి పేరుకు నిదర్శనాలు.

ధనరేఖకు ఎన్నిగమన దిశలు ఉంటా యో వీటికి కూడా అవే ఉంటా యి. కేవలం మనం చెప్పవలసిందల్లా సూర్యకారకాలు మాత్రమే.

ఈ రేఖను భానురేఖ, ఉద్యోగరేఖ, విద్యారేఖ, కీర్తిరేఖ, రవిరేఖ, పుణ్యరేఖ, పవిత్రరేఖ, జయరేఖ అని పలురకాల పేర్లతో పిలుస్తారు.

ఇది ప్రధానంగా విద్య, ఉద్యోగం, అధికారం, పరువు, ప్రతిష్టలు, రాణింపు, ఉజ్వలభవిష్యత్తు, పదోన్నతులు, సన్మానాలు, విజయాలు, కళానైపుణ్యం, ధన సంపత్తులు, సుఖజీవనం మొదలైన ఎన్నో కారకాలను తెలియజేస్తుంది.

1. ఈ రేఖపై ఒకి రెండు ఊర్ధ్వరేఖలుండుట ఆయా కారకాల ప్రగతిని, అదోరేఖలు ఆయా కారకాల పతనాలను సూచిస్తాయి.

2. ఈ రేఖ పక్కకు సన్నగా అక్కడక్కడ చిన్నగా చిన్న ఊర్ధ్వరేఖలు కనబడిన ఈ రేఖకు లోటురాకుండా సహాయకారిగా తోడ్పడుతుటాయి.

3. ఈ రేఖ భాగ్యరేఖ పక్కనుండి కంకణరేఖల ప్రాంతం బయలుదేరిన జాతకుడు బాగా ధన మానాలు గల కుటుంబంలో జన్మించినవాడని అంతేకాక తన స్వయం ప్రతిభతో తానే ఇతోధిక అభివృద్ధి చేసుకునేవాడని ఎక్కడ ఉన్నా తనకంటూ ఒక గౌరవమైన స్థానాన్ని కలిగి ఉంటారని మంచి దీక్షా, దక్షతలతో పనిచేయు నేర్పరి అని ఎన్నో సన్మానాలు సత్కారాలకు యోగ్యుడని చెప్పవచ్చు.

4. ఈ రేఖపై ఖండనలుండటం, గుణకములుండటం, యవరేఖలుండటం, విరుపులుండటం ఎంతమాత్రం మంచిది కాదు. వీరు ఇలాంటి  దుష్ట చిహ్నాలు గల స్థానాలలో పాకురుబండపై నడిచేంత జాగ్రత్త వహించిన కొంత లోపనివారణ జరుగవచ్చును.

ఉప ప్రధానరేఖలు అందరికీ ఉండాలని లేదు. భాగ్య రేఖ లేకున్నప్పుడు ఈ రేఖనే ఉభయాత్మక రేఖగా ఉపయోగపడుతుంది. భాగ్యరేఖ ఉన్నప్పుడు మాత్రం ఈ రేఖ సూర్యరేఖగా ఉపయోగపడుతుంది.

డా.ప్రతిభ

PREV
click me!

Recommended Stories

Monalisa Bhonsle: చదువుకుందామనుకున్నా సినిమాల్లోకి తీసుకొచ్చారు.. కుంభమేళా మోనాలిసా
Surya Varuna Yogam: అరుదైన సూర్యవరుణ యోగంతో ఈ 3 రాశుల వారికి అప్పుల నుంచి విముక్తి