20 సెప్టెంబర్ 2018 గురువారం మీ రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Sep 20, 2018, 9:28 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శ్రమాధిక్యం. గుర్తింపుకై ఆరాట పడతారు. పనుల్లో ఒత్తిడి ఉంటుంది.  అధికారులతో అప్రమత్తత అవసరం. పోటీల్లో గెలుపు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాట పడతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు ఒత్తిడిఅధికంగా ఉంటుంది. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పనుల్లో లోపాలు కనబడతాయి.  సంతృప్తి లభించదు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఆహారంలో సమయపాలన అవసరం. ప్రయాణాల్లో సౌకర్యాలు వెతుక్కుటాంరు. ఊహించనిఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులకై ఆరాటపడతారు. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతనోత్సాహం ఉంటుంది. పనుల్లో జాగ్రత్తలు. గౌరవం కోసం ఆరాటపడతారు. అన్ని విధాలా ఆదాయాలు. అధికారులతో అనుకూలత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విశ్రాంతి లోపిస్తుంది. అనవసర ఖర్చులు చేస్తారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సుఖం కోసం ఆరాటపడతారు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. ఒత్తిడులు అధికం అవుతాయి. పోటీల్లో గెలుపుకై ఆరాట పడతారు. అనవసర ఇబ్బందులు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకై ఆరాట పడతారు. పోటీల్లో గెలుపు సాధ్యం. శతృవులపై విజయం సాధిస్తారు. ఋణసంబంధ ఆలోచనలు తీరుతాయి. మానసిక ప్రశాంతత కోసం ఎదురు చూపులు. విద్యార్థులకు ఒత్తిడిఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విశ్రాంతికై ఆరాటపడతారు. పాదాల నొప్పులు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ఇబ్బందులు తెచ్చుకుటాంరు. దూర ప్రయాణాలపై దృష్టి. పరాధీనత ఉంటుంది.  ఆహార సౌఖ్యం లోపిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతృప్తి లభిస్తుంది. ఆదర్శవంతమైన జీవితం కోసం ఆరాట పడతారు. సహకారాలు లభిస్తాయి. పనుల్లో సానుకూలత ఉంటుంది.  ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉంటుంది. అధికారం కోసం ఆరాటపడతారు. గౌరవం కోసం తపిస్తారు. అధికారిక ప్రయాణాలు చేస్తారు. వాగ్దాల వల్ల ఒత్తిడి. కుటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శ్రమాధిక్యం. గుర్తింపుకై ఆరాటం. పనుల్లో ప్రణాళికల ఉంటుంది. అనారోగ్య భావన ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఉంటాయి. సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రశాంతత అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. నిల్వ ధనం కోల్పోతారు. అనవసర ఖర్చులు చేస్తారు. పనుల్లో ఆటంకాలు వస్తాయి. విశ్రాంతి లోపిస్తుంది. విహారయాత్రలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. లభిస్తాయి. లాభాలు సంతృప్తినిస్తాయి. అనుకున్న పనులు పూర్తి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు అప్రమ్తతతో ఉండాలి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

డాఎస్ ప్రతిభ

click me!