ఇంట్లో ప్రశాంతంత లభించాలంటే... ఈ వాస్తు నియమాలు పాటించాల్సిందే...!

By telugu news teamFirst Published Nov 16, 2022, 1:28 PM IST
Highlights

జోతిష్యశాస్త్రం ప్రకారం మనం చేసే కొన్ని పనులతో ఇంట్లో సుఖ శాంతులు పెంపొందేలా చేసుకోవచ్చట. ఇంట్లో దోషాలు, కష్టాలు తొలగిపోవాలి అంటే... ఏం చేయాలో ఓసారి చూద్దాం... 


ప్రతి ఒక్కరూ సంతోషంగా , ప్రశాంతంగా తమ ఇల్లు ఉండాలని కోరుకుంటారు. కానీ... చాలా మంది ఇళ్లల్లో ప్రతిరోజూ ఏదో గొడవ, వాదనలు, కొట్టాటలు జరుగుతూ ఉంటాయి.   రోజువారీ గొడవలు, కుటుంబ కలహాల కారణంగా మీ ఇంట్లో శాంతి  కోల్పోతారు. ఇది అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల కెరీర్‌లో పురోగతి ఆగిపోతుంది. చదువు దెబ్బతినడం, వ్యాపారంలో నష్టం, పని ప్రదేశంలో ఆసక్తి లేకపోవడం సమస్యలకు దారి తీస్తుంది.

జోతిష్యశాస్త్రం ప్రకారం మనం చేసే కొన్ని పనులతో ఇంట్లో సుఖ శాంతులు పెంపొందేలా చేసుకోవచ్చట. ఇంట్లో దోషాలు, కష్టాలు తొలగిపోవాలి అంటే... ఏం చేయాలో ఓసారి చూద్దాం... 

శాంతి కోసం ఇంటి నివారణలు
వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉండాలి. వంటగది ఆగ్నేయ దిశలో ఉంటే.. ఆ ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారు. 

ఇంట్లో శాంతి ఉండాలంటే...  ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి వాస్తు చిట్కాల ప్రకారం, వినాయకుని బొమ్మను ఇంటి ముందు తలుపుకు అభిముఖంగా ఉంచాలి. మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఖాళీ గోడ కనిపిస్తే, మీ ఇంట్లో చాలా ఒంటరితనం ఉందని అర్థం. కాబట్టి.. ఆ స్థలంలో వినాయకుడి ఫోటో పెట్టడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది.


సోదరుల మధ్య విభేదాలు తొలగాలంటే...
జ్యోతిష్య శాస్త్రంలో, గృహ బాధలకు అనేక నివారణలు ఉన్నాయి. ఇంట్లో అన్నదమ్ముల మధ్య శత్రుత్వం ఉంటే, మనస్పర్థలు మామూలే అయితే వాటిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం.

వినాయకుడిని, కార్తీకాన్ని క్రమం తప్పకుండా పూజించండి.
శివపూజలో శమీ పత్రాన్ని ఉపయోగించండి.
విష్ణువుకు తులసి ఆకులను సమర్పించండి.
రామచరిత మానస పఠించండి.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు...
చిన్నవో, పెద్దవో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల కారణంగా   ఆ ఇంట్లో సంతోషం, శాంతి చెదిరిపోతుంది. జ్యోతిష్య శాస్త్రంలో, ఈ బాధ నుండి శాంతి కోసం అనేక నివారణలు ఉన్నాయి.
బుధవారం నాడు భార్యాభర్తలు 2 గంటల పాటు మౌనవ్రతం పాటించాలి.
గృహ సమస్యలను నివారించడానికి , తన భార్యను సంతోషపెట్టడానికి భర్త శుక్రవారాల్లో పెర్ఫ్యూమ్ ఉపయోగించాలి. భార్యకు ఇవ్వాలి. ఈ రోజున జీవిత భాగస్వామికి వెండి గిన్నెలో పెరుగు పంచదార ఇవ్వాలి.
ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత భార్య తన భర్త నుదుటిపై కుంకుమ తిలకం పెట్టాలి. భర్త తన భార్యకు పసుపు, కుంకుమ పెట్టాలి.
లక్ష్మీనారాయణ, గౌరీశంకరులను నిత్యం పూజించండి. శివపార్వతుల సన్నిధానాన్ని తరచుగా దర్శించుకోవడం అలవాటు చేసుకోండి.

click me!