
అందరూ ఏదో ఒకటి దొరికిన ఉద్యోగం చేయాలని అనుకోరు. కొందరికి డ్రీమ్ జాబ్ అనేది ఉంటుంది. తాము కోరుకున్న ఉద్యోగం మాత్రమే చేయాలని అనుకుంటారు. దాని కోసం ఏంతైనా కష్టపడాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే.. అందరికీ ఆ కళ నిజం కాకపోవచ్చు. కొందరికి మాత్రమే సాధ్యమౌతుంది.
చాలా మంది కేవలం జీతం కోసమే ఉద్యోగం చేయాలని అనుకోరు. నచ్చిన ఉద్యోగం చేయడం వల్ల సంతృప్తి దొరుకుతుంది. అయితే.. జోతిష్యం ప్రకారం కొన్ని రకాల పనులు చేయడం వల్ల మనకు నచ్చిన ఉద్యోగం లభిస్తుందట. మరి ఏం చేయాలో ఓసారి చూద్దామాి...
ఏదైనా సాధించాలి అంటే.. భగవంతుని దయ చాలా ముఖ్యం. అలా మీకు నచ్చిన దేవుడిని ఆరాధించడం వల్ల మీకు పని మాత్రమే కాదు, మీరు చేసే పనిలో విజయం కూడా లభిస్తుంది. దీనికి తోడు దేవుడి ముందు దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంటి నుంచి కొత్త ఉద్యోగానికి బయలుదేరే ముందు ఎడమ కాలు ముందు బయట పెట్టాల్సి ఉంటుంది. అలాగే తీపి లేదా పెరుగు-చక్కెర తింటే తప్పకుండా విజయం సాధిస్తారు.
చాలీసా (హనుమాన్ చాలీసా)
మీకు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతుంటే హనుమంతుడు గాలిలో ఎగురుతున్న ఫోటోను ఇంట్లో ఉంచాలి. ప్రతిరోజూ ఆంజనేయుడిని పూజించాలి. ప్రతి మంగళవారం హనుమంతుని స్తోత్రం చేయాలి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఇష్టాలు సిద్ధిస్తాయి.
మీరు నెలలో మొదటి సోమవారం నాడు తెల్లటి వస్త్రంలో నల్ల బియ్యాన్ని వేసి కాళీ ఆలయానికి తీసుకెళ్లాలి. వీటిని కాళీ దేవి పాదాలపై ఉంచడం వల్ల పనిలో ఇబ్బందులు తొలగిపోతాయి. పక్షులకు ప్రతిరోజూ ఉదయం ఏడు రకాల తృణధాన్యాలు ఇస్తే, అవి వేగంగా పనికి వస్తాయి. ప్రతి సోమవారం శివలింగానికి నీరు సమర్పించడం వల్ల కూడా మంచి జరుగుతుంది.
ఈ మంత్రాన్ని పఠించండి
ఒక నిమ్మకాయలో నాలుగు లవంగాలను గుచ్చి "ఓం శ్రీ హనుమతే నమః" అని 108 సార్లు జపించాలి. తర్వాత ఆ నిమ్మకాయను మీ వెంటే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు.
ఇంటర్వ్యూ రోజున, హనుమాన్ చాలీసా పఠించాలి. స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలా పసుపు వేసిన ఆ నీటితో స్నానం చేస్తే నెగెటివ్ ఎనర్జీ పోతుందని అంటారు. ఈ రెమిడీస్ ఫాలో అవ్వడం వల్ల.. మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.