ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వాక్‌దానాలు నెరవేరుతాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషవాతావరణం ఉంటుంది. ఆర్థిక నిల్వలపై దృష్టి పెంచుకుటా ంరు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. మాట విలువ పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు పనిచేస్తాయి. శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కమ్యూనికేషన్స్ వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటా యి. విద్యార్థులకు అధిక శ్రమతో తక్కువ ఫలితాల సాధన ఉంటుంది. సోదర వర్గీయుల సహకారం తక్కువౌతుంది. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అనుకునంత సహకారం లభించదు. శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాలు సమకూర్చుకుటా ంరు. సౌకర్యాల వల్ల సంతోషం ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆహారంపై దృష్టి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొటా ంరు. ఇంటి సంబంధ పనుల్లో పాల్గొటా ంరు. అన్ని పనులు పూర్తిచేస్తారు. శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఊహించని ఇబ్బందులు ఉంటా యి. చేసే పనుల్లో ఆలోచన తక్కువగా ఉంటుంది. చిత్త చాంచాల్యాన్ని తగ్గించుకోవాలి. సృజనాత్మకతను కోల్పోతారు. అధికారులతో వ్యవహరించేటప్పుడు ఆచి, తూచి వ్యవహరించాలి. శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. ఆచి, తూచి వ్యవహరిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. శ్రమానంతరం గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అప్పుల బాధలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. పెట్టుబడులు అనుకూలించవు. విస్తరణ తగ్గుతుంది. వ్యాపారస్తులు కొంత అప్రమత్తత అవసరం. నూతన పరిచయస్తులతో ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపాటు పనికిరాదు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శ్రమలేని ఆదాయంపై దృష్టి ఉంటుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. పరామర్శలు చేస్తారు. ఊహించని లాభాలు వచ్చే సూచనలు. ప్రయాణాలుఅనుకూలిస్తాయి. పెట్టుబడులు విస్తరిస్తాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో మంచి ఫలితాల సాధన. శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. అనుకున్న పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. పరిశోధకులకు అంత అనుకూలం కాదు. ఉన్న స్థితిలోనే ఉండాలి. పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. సంతృప్తి తగ్గుతుంది.శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అధికారులతో అననుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలపై దృష్టి పెరుగుతుంది. ఉద్యోగస్థులు అనుకూలంగా ఉంటా రు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. అన్ని పనుల్లో లాభాలు సమకూరుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. చిత్త చాంచల్యాన్ని వదిలిస్తారు. శ్రమానంతరం ఫలితాలు లభిస్తాయి. అన్ని పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విహార యాత్రలపై దృష్టి పెడతారు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు. విద్యార్థులకు కొంత శ్రమ తప్పదు. శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేయాలి. పట్టుదలతో కార్యసాధన అవసరం. మొదలు ప్టిెన పని పూర్తి అయ్యేవరకు వదిల కూడదు. ఒత్తిడితో వ్యవహారాలు పూర్తి చేస్తారు. జాగ్రత్త అవసరం. శ్రీ విష్ణవే నమః జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ