అమలాపురం నుంచి టీడీపి అభ్యర్థిగా బాలయోగి తనయుడు

By telugu teamFirst Published Mar 5, 2019, 3:15 PM IST
Highlights

 అమలాపురం రిజర్వుడు లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వానికి దివంగత నేత, మాజీ లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధూర్‌ పేరును ఖరారుచేసేందుకు పార్టీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది

అమలాపురం: వచ్చే లోకసభ ఎన్నికల్లో అమలాపురం నుంచి మాజీ లోకసభ స్పీకర్ జిఎంసి బాలయోగి తనయుడిని పోటీకి దింపాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అమలాపురం లోకసభ సీటు అభ్యర్థిగా హరీష్ మాథుర్ పేరను ఆయన ఖరారు చేసే అవకాశం ఉంది.

అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పార్టీ శ్రేణులతో మంగళవారం చంద్రబాబునాయుడు సమీక్ష జరపనున్నారు. 

జిల్లాలో టీడీపీ సిటింగ్‌లకే చంద్రబాబు ఎక్కువగా అవకాశం కల్పించవచ్చు. అమలాపురం రిజర్వుడులోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఒకటి రెండు మినహా మిగిలిన స్థానాల్లో సిట్టింగ్‌లకే అవకాశం దక్కవచ్చు..

 అమలాపురం రిజర్వుడు లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వానికి దివంగత నేత, మాజీ లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధూర్‌ పేరును ఖరారుచేసేందుకు పార్టీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది
 
తండ్రి బాలయోగికి ఉన్న పేరు ప్రతిష్టలతోపాటు యువకుడైన హరీష్ మాధూర్‌ నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. 

click me!