టీడీపీలో సీట్లసర్దుబాటు: రాయపాటికి నో టికెట్, కుమారుడు రంగబాబుకి ఛాన్స్

By Nagaraju penumalaFirst Published Mar 18, 2019, 9:03 PM IST
Highlights

రాయపాటి సాంబశివరావును రాబోయే ఎన్నికల్లో పోటీ చేయించే యోచనపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాయపాటి స్థానంలో భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  మరోవైపు రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబుకు గుంటూరు పశ్చిమ టికెట్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. 

గుంటూరు: గుంటూరు జిల్లాలో సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం పార్టీ వేగవంతం చేసింది. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత ఎంపీ రాయపాటి సాంబశివరావు అలకతో సీట్ల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 

రాయపాటి సాంబశివరావు కుటుంబానికి ఎక్కడ టికెట్లు కేటాయించాలి అనే దానిపై పీఠముడి విప్పే ప్రయత్నం చేస్తున్నారు. నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు చంద్రబాబు. 

నరసరావుపేట టికెట్ రాయపాటి సాంబశివరావుకు ఇవ్వాలా లేక మరో అభ్యర్థిని ప్రకటించాలా అన్న అంశంపై చర్చజరుగుతుందని తెలుస్తోంది. వయసు రీత్యా రాయపాటి సాంబశివరావుకు టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. 

రాయపాటి సాంబశివరావును రాబోయే ఎన్నికల్లో పోటీ చేయించే యోచనపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాయపాటి స్థానంలో భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

మరోవైపు రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబుకు గుంటూరు పశ్చిమ టికెట్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా మద్దాల గిరిని ప్రకటించారు చంద్రబాబు. 

అయితే రాయపాటి రంగబాబును గుంటూరు పశ్చిమ  నుంచి బరిలోకి దించితే మద్దాల గిరిని నరసరావుపేట అసెంబ్లీ నుంచి పోటీ చెయ్యించాలని చూస్తోంది. ఇకపోతే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దించే యోచనపై చర్చిస్తోంది పార్టీ అధిష్టానం. 

ఆలపాటి రాజేంద్రప్రసాద్ నరసరావుపేట పార్లమెంట్ కు పోటీ చెయ్యనని చెప్పిన నేపథ్యంలో భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణను బరిలోకి దించాలని టీడీపీ ప్లాన్ వేస్తోంది. రాత్రికి రాయపాటి ఫ్యామిలీ టికెట్లపై చంద్రబాబు ఓ కొలిక్కి తేనున్నట్లు సమాచారం. 
 

click me!