చంద్రబాబుకు ఎస్పీవై రెడ్డి షాక్ : ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటన

By Nagaraju penumalaFirst Published Mar 18, 2019, 7:44 PM IST
Highlights

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబానికి టికెట్‌ ఇస్తానని మాట ఇచ్చి, ఆశలు పెంచి మోసం చేశారని ఆసహనం వ్యక్తం చేశారు.

కర్నూలు : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ షాక్ లపై షాక్ లు తగులుతున్నాయి. టికెట్ ఇచ్చినా కూడా పార్టీ కొందరు వీడుతుంటే...మరికొందరు పార్టీ వీడుతున్నారు. 

అయితే తాజాగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబానికి టికెట్‌ ఇస్తానని మాట ఇచ్చి, ఆశలు పెంచి మోసం చేశారని ఆసహనం వ్యక్తం చేశారు. తమకు టికెట్లు ఇవ్వనిపక్షంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. 

నంద్యాల ఎంపీగా తాను, ఎమ్మిగనూరు లేదా నంద్యాల ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు. గురువారం నామినేషన్‌ దాఖలు చేయబోతున్నామని ఎస్పీ వై రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో తమకు ఆదరణ ఉందని ఆ నమ్మకంతోనే స్వతంత్రంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 
 

click me!