విశాఖ ఎంపీ బరిలో ముగ్గురూ కొత్తవారే..గెలుపెవరిదో

By ramya NFirst Published Mar 20, 2019, 3:13 PM IST
Highlights

విశాఖ ఎంపీ సీటుకోసం జరుగుతున్న పోరు రసవత్తరంగా ఉంది. మూడు కీలక పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు నేతలూ.. రాజకీయాలకు కొత్తే. 


విశాఖ ఎంపీ సీటుకోసం జరుగుతున్న పోరు రసవత్తరంగా ఉంది. మూడు కీలక పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు నేతలూ.. రాజకీయాలకు కొత్తే. తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. వెంటనే టికెట్ దక్కించుకొని.. ఎన్నికల బరిలో నిలిచారు.

టీడీపీ నుంచి శ్రీభరత్. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల ఛైర్మన్ గా విధులు కొనసాగిస్తున్నారు. విదేశాల్లో చదువు సాగించారు. ఇటవల గీతం బాధ్యతలు చేపట్టారు. తాతల నుంచి రాజకీయ వారసత్వం అందుకున్నారు.  భరత్ తాతయ్య ఎంవీవీఎస్‌ మూర్తి గతంలో విశాఖ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

వైసీపీ నుంచి బిల్డర్.. ఎంవీవీ సత్యనారాయణ. డిగ్రీ చదువుకున్నారు. పశ్చిమగోదావరి  జిల్లాకు చెందతిన ఈయన కొంతకాలం పాటు కాంట్రాక్ట్ పనులు చేశారు. ఆ తర్వాత విశాఖ వచ్చ సొంతంగా బిల్డర్ గా ఎదిగారు. ఎంవీవీ బిల్డర్స్ పేరుతో నగరంలో చాలా అపార్ట్ మెంట్స్ ఉన్నాయి.

జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..ఈయన గురించి తెలియని వారు చాలా అరుదు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సొంతంగా ఒక పార్టీని పెట్టాలని భావించారు. అయితే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆలోచన విరమించుకున్నారు. పవన్ సమక్షంలో జనసేన లో చేారు. 

click me!