జనసేన నుంచి ఎంపీ గా పోటీచేయనున్న నాగబాబు?

By ramya NFirst Published Mar 14, 2019, 11:06 AM IST
Highlights

మెగా బద్రర్ నాగబాబు ఎన్నికల బరిలోకి దిగనున్నారా..? తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయనున్నారా? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. 


మెగా బద్రర్ నాగబాబు ఎన్నికల బరిలోకి దిగనున్నారా..? తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయనున్నారా? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. గత కొంతకాలంగా.. నాగబాబు యూట్యూబ్ ఛానెల్ ప్రత్యేకంగా పెట్టి మరీ.. టీడీపీ, వైసీపీ అధినేతలను.. వారికి మద్దతుగా నిలిచే మీడియా సంస్థలను వ్యంగ్యంగా ఏకిపారేసారు. 

అయితే.. తాను మాత్రం జనసేనలో చేరడం లేదని.. కేవలం జనసేన కార్యకర్తగా మాత్రమే తాను ఇలా మాట్లాడుతున్నానని క్లారిటీ ఇచ్చాడు. అయితే.. ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో.. నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టినప్పుడు అన్నయ్యకు చేదోడువాదోడుగా ఉన్న నాగబాబు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు.

 అయితే తాజాగా తన అన్నయ్యను లోక్‌సభ ఎన్నికల్లో నిలబెట్టాలని పవన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల గుంటూరులో జనసైనికులతో సమావేశం నిర్వహించిన నాగబాబు తాను సాధారణ కార్యకర్తను మాత్రమేనని చెప్పారు. అయితే గుంటూరు పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆయన ఈ సమావేశం నిర్వహించినట్లు కొందరు చెబుతున్నారు. 

పోటీకి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన్ని లోక్‌సభ బరిలో దించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారట. గుంటూరు లేదా నర్సాపురం నుంచి ఆయన్ని పోటీ చేయించాలని యోచిస్తున్నారు. నాగబాబు ఎంపీగా పోటీచేస్తే దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మేలు చేస్తుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో అతి త్వరలోనే క్లారిటీ రానుంది. 

click me!