ఏపీకి ప్రత్యేక హోదా దక్కకపోవడానికి చంద్రబాబే కారణం: రాజ్‌నాథ్ సింగ్

By Arun Kumar PFirst Published Apr 3, 2019, 7:28 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కసారి కూడా తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగలేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కానీ ఎన్నికలు దగ్గరపడే సరికి తాను అడిగినా కేంద్రం ఇవ్వలేదని అసత్య ప్రచారాన్ని మొదలుపెట్టాడని ఆరోపించారు. ఏపికి ప్రత్యేక హోదా రాకపోడానికి ముఖ్య కారణం చంద్రబాబేనని...అతడి నిర్లక్ష్యం వల్లే తమ దృష్టికి ప్రత్యేక హోదా అంశం రాలేదని హోంమంత్రి భయటపెట్టారు. 

దేశ వ్యాప్తంగా పలు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 11వ తేదీన మొదటి విడతలోనే ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఉత్తరాది నాయకులు సైతం ఏపి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇలా  బిజెపి పార్టీ అభ్యర్థుల తరపున కేంద్ర హోం మంత్రి కూడా అవనిగడ్డ లో ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు.  ముఖ్యంగా చంద్రబాబునే టార్గెట్ గా చేసుకుని హోంమంత్రి ప్రసంగం సాగింది. 

చంద్రబాబు నాయుడు తమతో విబేధించినా తాము ఏపి ప్రజల కోసమే టిడిపి ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. పోలవరం కు జాతీయ హోదా కల్పించి ఇప్పటివరకు రూ.7వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. అలాగే వివిద పథకాల కోసం భారీగా నిధులు అందించినట్లు హోంమంత్రి వివరించారు. కానీ టిడిపి ప్రభుత్వం మాత్రం తాము ఒక్కరూపాయి ఇవ్వలేమంటూ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. 

తెలుగు దేశం పార్టీతో బీజేపీకి పొత్తు ఉన్నా లేకపోయినా ఏపీకి వచ్చే నిధులు మాత్రం ఆగవని అన్నారు. అంతే కాదు మళ్ళీ అధికారంలోకి రాగానే మచిలీపట్నం పోర్టు తో పాటు వరికి మరింత గిట్టుబాటు ధర కల్పిస్తామని రాజ్ నాథ్ హామీనిచ్చారు. 
 
click me!