గుంటూరు టీడీపీ ఎంపీ సీటు గల్లా జయదేవ్‌కే

Published : Mar 04, 2019, 04:51 PM IST
గుంటూరు టీడీపీ ఎంపీ సీటు గల్లా జయదేవ్‌కే

సారాంశం

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరోసారి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేయనున్నారు.

గుంటూరు:గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరోసారి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేయనున్నారు.

2014 ఎన్నికల సమయంలో గల్లా జయదేవ్ తొలిసారిగా టీడీపీ అభ్యర్ధిగా గుంటూరు ఎంపీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆదివారం నాడు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపికపై బాబు కసరత్తు నిర్వహించారు. సోమవారం నాడు కూడ ఈ కసరత్తు నిర్వహించనున్నారు.

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి గల్లా జయదేవ్ మరోసారి ఎంపీ స్థానం నుండి పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని పొన్నూరు నుండి దూళిపాల నరేంద్ర, తెనాలి నుండి ఆలపాటి రాజాలకు చంద్రబాబునాయుడు టిక్కెట్లను ఖరారు చేశారు. గుంటూరు తూర్పు నుండి సినీ నటుడు అలీకి టిక్కెట్టు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. అయితే అలీ పోటీకి దూరంగా ఉంటే షరీఫ్ కు ఈ సీటును ఖరారు చేసే అవకాశం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....