ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: జగన్, చంద్రబాబు హోరా‌హోరీ

By narsimha lodeFirst Published May 19, 2019, 8:03 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో పలు సర్వే సంస్థలు  పలు రకాలుగా  సర్వే ఫలితాలను ప్రకటించాయి. కొన్ని సంస్థలు టీడీపీకి ఎక్కువగా సీట్లు వస్తాయని ప్రకటిస్తే... కొన్ని సంస్థలు వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించాయి. అయితే ఆయా సంస్థల సర్వే ఫలితాలు ఏ మేరకు వాస్తవం అవుతాయో అనే విషయం ఈ నెల 23వ తేదీన తేలనుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో పలు సర్వే సంస్థలు  పలు రకాలుగా  సర్వే ఫలితాలను ప్రకటించాయి. కొన్ని సంస్థలు టీడీపీకి ఎక్కువగా సీట్లు వస్తాయని ప్రకటిస్తే... కొన్ని సంస్థలు వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించాయి. అయితే ఆయా సంస్థల సర్వే ఫలితాలు ఏ మేరకు వాస్తవం అవుతాయో అనే విషయం ఈ నెల 23వ తేదీన తేలనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా దక్కాలంటే 25 ఎంపీ స్థానాలు ఏపీలో రెండు పార్టీలకు కీలకంగా మారాయి. ఏపీలో ఎక్కువ ఎంపీ సీట్లను కైవసం చేసుకొంటే ప్రత్యేక హోదా గురించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టే పార్టీపై ఒత్తిడి తీసుకురావచ్చని టీడీపీ, వైసీపీలు వ్యూహంతో ఉన్నాయి.

ప్రత్యేక హోదా ఎవరు ఇస్తామని ప్రకటిస్తే ఆ పార్టీకే మద్దతిస్తామని జగన్ ప్రకటించారు. కానీ, కేంద్రంలో తమ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.


లగడపాటి సర్వే 

టీడీపీ- 15(02 సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)
వైసీపీ - 02 (02 సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)

ఇండియాటుడే
వైసీపీ  18-20
టీడీపీ  4-6
ఇతరులు 0-1

న్యూస్ -18
 
టీడీపీ 10-12
వైసీపీ 13-14
జనసేన -0
బీజేపీ -1

ఐఎన్ఎస్ఎస్
టీడీపీ - 17
వైసీపీ -7
జనసేన -01

ఎన్డీటీవీ

టీడీపీ- 8
వైసీపీ -17

టుడేస్ చాణక్య
వైసీపీ -08
టీడీపీ -17

click me!