ఓటమి సంకేతాలు...అందువల్లే టిడిపి ఈవీఎంలపై దుష్ప్రచారం: వైవి సుబ్బారెడ్డి

By Arun Kumar PFirst Published Apr 11, 2019, 10:52 AM IST
Highlights

తెలుగు దేశం పార్టీకి ప్రస్తుతం జరుగుతున్న పోలింగ్ సరళిని చూసి భయం పట్టుకుందని వైఎస్సార్‌సిపి నాయకులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. తాము అధికారాన్ని కోల్పోతున్నట్లు వస్తున్న సంకేతాల వల్లే వారిలో ఆందోళన మొదలయ్యిందని...అందువల్లే ఏదో జరుగుతున్నట్లు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని సుబ్బారెడ్డి వెల్లడించారు. 

కావాలనే టిడిపి నాయకులు ఈవీఎంలు పనిచేయడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల ప్రజలు పోలింగ్ లో పాల్గొనకుండా అడ్డుకుని తమకు వ్యతిరేకంగా పడుతున్న ఓట్లను తగ్గించుకోవాలని చూస్తోందన్నారు. ప్రజలేవ్వరూ వారి మాటలు నమ్మవద్దని... ప్రతి ఒక్్కరు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

ఇప్పటివరకు తమకందిన సమాచారం మేరకు కేవలం 100 బూతుల్లో మాత్రమే ఈవీఎం పనిచేయడం లేదని  తెలిపారు. ఈ విషయాన్ని తాము ఎన్నికల సంఘానికి కూడా తెలియజేశామన్నారు. వారు త్వరగా స్పందించి ఆయా బూతుల్లో సమస్యను పరిష్కరించాలని సూచించారు. 

ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు,టిడిపి నాయకులు పచ్చ చొక్కాలు వేసుకుని పోలింగ్ బూతుల్లోకి వెళ్లడాన్ని సుబ్బారెడ్డి తప్పుబట్టారు. అంతేకాకుండా అలాగే మీడియాతో మాట్లాడుతున్నారన్నారు. టిడిపికి ప్రచారం చేస్తున్నట్లుగా పచ్చ చొక్కాలతో పోలింగ్ బూతుల్లోకి వెళ్లే నాయకులను అడ్డుకోవాలని అధికారులను కోరారు. 
 
వైసిపి కార్యకర్తలపై పలు చోట్ల దాడులు జరిగినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఏలూరు లో టిడిపి అభ్యర్థి బడేటి బుజ్జి తమ పార్టీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డాడని...కాబట్టి అతడిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తూ దౌర్జన్యానికి దిగిన అతన్ని అనర్హుడిగా ప్రకటించాలని సూచించారు. అలాగే కడపలో సీఎం రమేష్ కూడా తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డాడని అతడిపై కూడా చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి ఈసీని కోరారు.   
 
click me!