
అమరావతి: ఈవిఎంలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, లోకసభకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవిఎంలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ సీఈవో ద్వివేదికి లేఖ రాశారు.
తెలుగుదేశం పార్టీకి ఓటేస్తుంటే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తనకు ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 30 శాతం ఈవిఎంలు పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. దానివల్ల 3 గంటలు వృధా అవుతోందని అన్నారు.
ఈవిఎంల పనితీరుపై ఓటర్లు ఆందోళనలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఈవిఎంలు పనిచేయని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈవిఎం సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించడానికి తగినంత మంది ఇంజనీర్లు ఉన్నారని ద్వివేది చెప్పారు. గతంలో కన్నా ఈసారి ఎక్కువ పోలింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు.