షర్మిలపై దుష్ప్రచారం బాలకృష్ణ భవనంనుండే జరుగుతోంది: వాసిరెడ్డి పద్మ

By Arun Kumar PFirst Published Apr 4, 2019, 6:35 PM IST
Highlights

ఓ మాజీ ముఖ్యమంత్రి తనయురాలు, ప్రతిపక్ష పార్టీ నాయకుడి సోదరి వెఎస్ షర్మిలపైనే టిడిపి నాయకులు ఇలా దుష్ప్రచారం చేస్తుంటే సామాన్య మహిళల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా వుంటుందో అర్థం చేసుకోవాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇలా ఓ స్థాయి మహిళల పరిస్ధితే ఇలా వుంటే సాధారణ మహిళలకు ఏం విలువ ఇస్తారని ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తున్న టిడిపిని మహిళా వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు. ఆడవాళ్ల పట్ల చంద్రబాబు మృగంలా దాపురించారని పద్మ ఫైర్ అయ్యారు. 

రాజకీయంగా వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకే ఇలా ఆయన కుటుంబ సభ్యులైన మహిళలపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రచారానికి చంద్రబాబు బామ్మర్ది, ఎమ్మెల్యే బాలకృష్ణ బిల్డింగ్ వేదికయ్యిందన్నారు. టీఎఫ్‌సి అనే మీడియా సంస్థ బాలకృష్ణకు సంబంధించిన ఓ బిల్డింగ్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని షర్మిలపై దుష్ప్రచారాన్ని చేస్తోందని వివరించారు.

ఈ సంస్థ ఏబిఎన్ తో కలిసి తప్పుడు సర్వే రిపోట్లతో ఓటర్లను కన్ప్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఏపి ఇంటెలిజెన్స్ అధికారుల సహాయం కూడా వుందన్నారు. ఇలా  వీరు ప్రచురిస్తున్న సర్వేలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని పద్మ తెలిపారు. 

మహిళలకు అన్యాయం చేస్తూ వారి పాలిట చంద్రబాబు ఓ మృగంలా మారాడని విమర్శించారు. సోషల్ మీడియాలో మహిళలపై కించపరుస్తూ ఇప్పుడు అదే మహిళలను ఓట్లు అడగడానికి చంద్రబాబుకు అర్హత లేదన్నారు. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లోని మహిళా లోకం చంద్రబాబుకు, టిడిపి అభ్యర్థులకు ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఇదేనని పద్మ సూచించారు. 
 
click me!