ఐటీ దాడులపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

Siva Kodati |  
Published : Apr 04, 2019, 03:58 PM IST
ఐటీ దాడులపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

సారాంశం

ఎన్నికల సమయంలో తెలుగుదేశం అభ్యర్థుల ఇళ్లపై ఐటీ దాడుల నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఎన్నికల సమయంలో తెలుగుదేశం అభ్యర్థుల ఇళ్లపై ఐటీ దాడుల నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గురువారం ఉదయం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో టీడీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వినతిపత్రం అందజేశారు.

ముగ్గురు టీడీపీ అభ్యర్థులపై ఉద్దేశ్యపూర్వకంగానే ఐటీ దాడులు జరిపారని... నామినేషన్ తర్వాత ఐటీ దాడులు జరపడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం టీడీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ద్వివేది ఫోన్‌లో ఐటీ అధికారులను వివరణ కోరారు. దీనిపై నోటీసులు పంపుతామని.. దాడులపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ ఐటీ అధికారులను ఆయన ఆదేశించారు. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు