ప్రజల కష్టాలు నాకు తెలుసు.. వైఎస్ భారతి

By ramya NFirst Published Apr 4, 2019, 5:00 PM IST
Highlights

ప్రజల కష్టాలు తనకు తెలుసు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అన్నారు. గురువారం ఆమె కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి భార్య సమతారెడ్డితో కలిసి వేంపల్లికి వచ్చారు. 

ప్రజల కష్టాలు తనకు తెలుసు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అన్నారు. గురువారం ఆమె కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి భార్య సమతారెడ్డితో కలిసి వేంపల్లికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పులివెందల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జగన్, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిలను గెలిపించాలని ఆమె కోరారు.

అనంతరం ఆమె వేంపల్లిలోని కొందరు మహిళలతో సమావేశం ఏర్ాపటు చేశారు. ఈ అయిదేళ్లలో ఎవరికీ ఇళ్లు మంజూరు కాలేదని అన్నారు. మహిళలు సంతోషంగా ఉండాలనేది జగన్‌ ఆకాంక్ష అని, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళల పేరుతోనే పట్టాలు ఇస్తామని చెప్పారన్నారు. అలాగే పిల్లలను ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ చదివించడానికి జగన్‌ అండగా నిలుస్తామని చెప్పారన్నారు. 

ఇక అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకంలో వెయ్యి రూపాయలు దాటితే ప్రభుత్వమే ఆ ఖర్చు భరిస్తుందన్నారు. డ్వాక్రా మహిళలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారని అన్నారు. 

వైఎస్సార్‌ ఆసరా పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నాలుగు దఫాలుగా రూ.75వేలు ఇస్తా ఈసారి చంద్రబాబు నాయుడు మోసాలకు మోసవద్దని వైఎస్‌ భారతి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ ‘నవరత్నాలు’ను ఓటర్లకు వివరించారు.
 

click me!