ఎల్వీతో కలిసి రేపు ఢిల్లీకి జగన్: మోడీతో భేటీ

By Nagaraju penumalaFirst Published May 25, 2019, 3:18 PM IST
Highlights

వైయస్ జగన్ తోపాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వైయస్ జగన్ తో కలిసి వెళ్తారని తెలుస్తోంది. ముందుగా సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు నరేంద్రమోదీకి వైయస్ జగన్ శుభాకాంక్షలు చెప్పనున్నారు. అనంతరం తన ప్రమాణ స్వీకారోత్సవానికి  హాజరుకావాలని కోరనున్నారు. 
 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టిసారించడం మెుదలుపెట్టేశారు. ఆదివారం ఢిల్లీ పర్యటన సందర్భంగా వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రత్యేక హోదాయే ప్రధాన అజెండాగా ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇకపోతే  ఈనెల 26న అంటే ఆదివారం ఉదయం 8.30గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు వైయస్ జగన్. 

10.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు వైయస్ జగన్. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని 12 గంటలకు ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. అయితే వైయస్ జగన్ తోపాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వైయస్ జగన్ తో కలిసి వెళ్తారని తెలుస్తోంది. 

ముందుగా సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు నరేంద్రమోదీకి వైయస్ జగన్ శుభాకాంక్షలు చెప్పనున్నారు. అనంతరం తన ప్రమాణ స్వీకారోత్సవానికి  హాజరుకావాలని కోరనున్నారు. 

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై వైయస్ జగన్ ప్రధానికి వివరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖకు సంబంధించి ప్రత్యేక నివేదిక రప్పించుకున్నారు జగన్. 

ఈ నేపథ్యంలో లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతున్నఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని కోరనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాస్టరానికి ప్రత్యేక హోదా అంశంపై కచ్చితమైన నిర్ణయం ప్రకటించాలని జగన్ విజ్ఞప్తి చేయనున్నారు.   

ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్ కు పయనమైన వైయస్ జగన్: గవర్నర్, కేసీఆర్ లతో భేటీ

 ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణ స్వీకారం...ముహూర్తం ఇదే

click me!