అప్పుడే జగన్ జోష్... తన పాలనపై ఫేస్ బుక్ లో కామెంట్

Published : May 22, 2019, 03:05 PM ISTUpdated : May 22, 2019, 03:14 PM IST
అప్పుడే జగన్ జోష్... తన పాలనపై ఫేస్ బుక్ లో కామెంట్

సారాంశం

ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. గురువారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.

ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. గురువారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. కాగా.... ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని... జగన్ ఇప్పటికే ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఆయనకు మద్దతుగానే వచ్చాయి. ఒకటో , రెండో తప్ప... మిగిలిన అన్ని సర్వేలు జగన్ దే విజయమని స్పష్టం చేశాయి. పోలింగ్ జరిగిన తర్వాత రోజే తమ విజయం ఖాయమని జగన్ నమ్మం వ్యక్తం చేశారు. కాగా... ఆ నమ్మకంతోనే తాజాగా ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు.

‘‘ రాజన్న పరిపాలన సిద్ధించడమే ఇక నా సంకల్పం’’ అని జగన్ పేర్కొన్నారు. ‘‘ ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలనే సాగాలి. మండుటెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓటు వేశారు. ప్రజా స్వామ్యం గొప్పతనాన్ని నిలబెట్టారు. వారి ఆశీస్సులు అందినవేళ వారికి బాధ్యుడినై ఉంటాను’’ అంటూ జగన్ పోస్టు చేశారు. కాగా... ఆయన విజయంపై ఉన్న ధీమా ఈ పోస్టులో తెలుస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు