లగడపాటిది దొంగసర్వే, నేను మళ్లీ గెలుస్తా.. రోజా

Published : May 22, 2019, 11:09 AM IST
లగడపాటిది దొంగసర్వే, నేను మళ్లీ గెలుస్తా.. రోజా

సారాంశం

తాను మళ్లీ ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. గురువారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. 


తాను మళ్లీ ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. గురువారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... బుధవారం ఆమె శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో ఫ్యాన్ గాలీ వీస్తోందని చెప్పారు.

రేపటి ఫలితాల్లో వైసీపీ మెజార్టీ సీట్లు గెలిచి... అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కూడా రెండోసారి నగరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే దొంగ సర్వేనని, ఈ విషయం తమిళనాడు, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తేలిందన్నారు. లగడపాటి సర్వేను ప్రజలు నమ్మడం లేదన్నారు. త్వరలోనే వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ధీమా వ్యక్తం చేశారు.

గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు హెరిటేజ్ ని అభివృద్ధి చేసుకున్నారు కానీ... రాష్ట్రాన్ని మాత్రం కాదని చెప్పారు. డ్వాక్రా మహిళలు... చంద్రబాబుని నమ్మలేదని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు