మంత్రి నారాయణ క్రియేషన్, ఎడిట్ చేసి అతికించారు: అనిల్ కుమార్ యాదవ్

By Nagaraju penumalaFirst Published Apr 2, 2019, 4:44 PM IST
Highlights

ఎలక్షన్ అనేది ఎప్పుడూ డూ ఆర్ డై అన్నట్లుగా ఉంటుందని తాను చెబుతుంటానని ఆ సందర్భంలోనే అలా అన్నానని వివరణ ఇచ్చారు. సైనికుడు యుద్ధరంగంలో దిగిన తర్వాత చనిపోవడమా, లేక చంపడమా అనేవి రెండే ఆప్షన్లు ఉంటాయి. 

నెల్లూరు: తనను దొంగ దెబ్బ తీసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. 16నెలల క్రితం తాను కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలను వక్రీకరించి తాజాగా వాటిని ప్రసారం చేస్తూ ఎన్నికల్లో తనపై దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. 

16 నెలల క్రితం తాను కార్యకర్తల సదస్సుతో మాట్లాడితే అది ఆదివారం మాట్లాడినట్లు చిత్రీకరించారని ఆరోపించారు. దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియో ఫుల్ గా పబ్లిష్ చెయ్యాలని సవాల్ విసిరారు. 2016 జనవరి 5న కార్యకర్తలను ఉద్దేశించి యువజన సదస్సులో మాట్లాడనని తెలిపారు.  

ఎలక్షన్ అనేది ఎప్పుడూ డూ ఆర్ డై అన్నట్లుగా ఉంటుందని తాను చెబుతుంటానని ఆ సందర్భంలోనే అలా అన్నానని వివరణ ఇచ్చారు. సైనికుడు యుద్ధరంగంలో దిగిన తర్వాత చనిపోవడమా, లేక చంపడమా అనేవి రెండే ఆప్షన్లు ఉంటాయి. 

మనం ఎన్నికల బరిలో దిగుతున్నాం, ఆ యుద్ధంలో చనిపోవడమా లేక చంపడమా అన్న ఉద్దేశంతో మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. తప్పుడు ఎడిటింగ్ వీడియోలతో మీకు తొత్తుగా వ్యవహరించే ఛానెల్స్ లో ప్రసారం చేస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. 

ఎడిటింగ్ పై జిల్లా ఎస్పీకి, ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తానని, లీగల్ యాక్షన్ తీసుకుంటానని అనిల్ హెచ్చరించారు. మంత్రి నారాయణ ఓడిపోతామనే భయంతో తనపై ఇలా వీడియోలు ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేసి తన మానసిక స్థైర్యాన్ని దెబ్బతియ్యాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

ఎన్నికల్లో అనైతిక చర్యలకు పాల్పడుతున్న మంత్రి నారాయణ చివరికి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఇది నీచాతి నీచం అన్నారు. మంత్రి నారాయణను వ్యక్తిగతంగా విమర్శించాలంటే తన దగ్గర చాలా ఉందని కానీ అంత నీచానికి దిగలేదన్నారు. 

నారాయణ కళాశాలలో 80 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఏనాడైనా పరామర్శించారా, వారికి అండగా నిలబడ్డారా అంటూ నిలదీశారు. మాట్లాడటం మెుదలుపెడితే రోజూ నీకంటే ఎక్కువ చెప్పగలనని స్పష్టం చేశారు. 

రాజకీయపరంగా ఎదుర్కొనలేక ఇలాంటి దుర్మార్గానికి దిగజారావని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. చిన్న స్కూల్ ను తొక్కి, అధికారులను మభ్యపెట్టి కోట్లు సంపాదించావని నీ దారుణాలు అందరికీ తెలుసునని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 

తాను ఇన్నేళ్లలో ఏ అవినీతి చెయ్యలేదని ఎక్కడికి రావాలన్నా వచ్చి ప్రమాణం చేస్తానని తనపై ఆరోపణలు చేసిన వారు చేస్తారా అంటూ సవాల్ విసిరారు. బెట్టింగ్ ఆరోపణలు చేసి ఇబ్బంది పెడదామని చూసి చివరికి కేసు కూడా కట్టలేకపోయారని అది తన నిజాయితీ అంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.  

ఈ వార్తలు కూడా చదవండి

చంపడమో.. వైసీపీ నేత షాకింగ్ కామెంట్స్

click me!