అప్పుడైతే వైసిపికి 127 సీట్లు వచ్చేవి, నేనున్నా, ఇప్పుడు రావు: పవన్ కల్యాణ్

By Nagaraju penumalaFirst Published Apr 2, 2019, 4:38 PM IST
Highlights

గతంలో తాను తమిళనాడుకు చెందిన ఓ సంస్థను న్యూట్రల్ గా సర్వే చేయమని చెప్పానని ఆ సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 127 సీట్లు గెలుస్తుందని ఇచ్చిందన్నారు. అయితే అప్పుడు బరిలో జనసేన పార్టీలేదని కానీ ఇప్పుడు జనసేన ఉందన్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు విజయంపై ఆశలు వదులుకోవాల్సిందేనని తెలిపారు. 

తణుకు: రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. తాను చిలక జోస్యం చెప్పడం లేదని ఒక కచ్చితమైన ఎనాలసిస్ ద్వారా చెప్తున్నానని తెలిపారు. 

ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీలు అధికారంలోకి రావన్నారు. గతంలో తాను తమిళనాడుకు చెందిన ఓ సంస్థను న్యూట్రల్ గా సర్వే చేయమని చెప్పానని ఆ సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 127 సీట్లు గెలుస్తుందని ఇచ్చిందన్నారు. 

అయితే అప్పుడు బరిలో జనసేన పార్టీలేదని కానీ ఇప్పుడు జనసేన ఉందన్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు విజయంపై ఆశలు వదులుకోవాల్సిందేనని తెలిపారు. 

జనసేన గెలుస్తుందన్న నమ్మకంతోనే చంద్రబాబు, వైఎస్ జగన్ లు జనసేనపై పడి ఏడుస్తున్నారని విరుచుకుపడ్డారు. జనసేనపై చంద్రబాబు కాకిగోల చేస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేక గోల చేస్తుందని పవన్ విమర్శించారు.   

ఈ వార్తలు కూడా చదవండి

మీ పల్లకి మోసి అలసిపోయాం: జగన్ పై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు

నేను మగాడ్ని: జగన్, చంద్రబాబులపై విరుచుకుపడిన ప

click me!