జగన్ సిఎం కావడం ఖాయం: వైసిపిలో చేరిన వంగా గీత

By Nagaraju penumalaFirst Published Mar 16, 2019, 5:20 PM IST
Highlights


కాకినాడ పార్లమెంట్ పరిధిలో వంగాగీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు కాకినాడ పార్లమెంట్ లో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన గీతను కాకినాడ నుంచి బరిలోకి దించితే గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.  
 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని మాజీమంత్రి వంగా గీత ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతారని వంగాగీత స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

వైఎస్ జగన్ సీఎం అవ్వడం ఖాయమని జగన్ సీఎం అయ్యేందుకు తాను సైనికుడిలా కష్టపడతానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమంలో తాను భాగస్వామిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. 

తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో వంగా గీతకు ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు అనుభవించారు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. అలాగే 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వంగా గీత పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇకపోతే వంగాగీత రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. 

కాకినాడ పార్లమెంట్ పరిధిలో వంగాగీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు కాకినాడ పార్లమెంట్ లో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన గీతను కాకినాడ నుంచి బరిలోకి దించితే గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.  

ప్రస్తుత కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం కూడా ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తోట నరసింహం రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. అయితే తోట నరసింహం వంగాగీతకు సహకరిస్తే ఆమె గెలుపు ఈజీ అవుతుందని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుకు ఝలక్: టీడీపి టికెట్ వచ్చినా వైసిపిలోకి జంప్

వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, వంగాగీత: కండువాకప్పిన వైఎస్ జగన్

 

click me!