చంద్రబాబుకు ఝలక్: టీడీపి టికెట్ వచ్చినా వైసిపిలోకి జంప్

By Nagaraju penumalaFirst Published Mar 16, 2019, 4:35 PM IST
Highlights

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నదే ఏపీ ప్రజల కోరిక అని చెప్పుకొచ్చారు. అందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా కూడా తాను ఎందుకు వైసీపీలో చేరాల్సి వచ్చిందో ఆదివారం పార్టీ కార్యకర్తలకు వివరిస్తానని ఆదాల తెలిపారు.  
 

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఝలక్ ఇచ్చారు టీడీపీ కీలక నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రకటించిన 126 మంది తొలిజాబితాలో టికెట్ దక్కించుకున్న నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నదే ఏపీ ప్రజల కోరిక అని చెప్పుకొచ్చారు. అందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా కూడా తాను ఎందుకు వైసీపీలో చేరాల్సి వచ్చిందో ఆదివారం పార్టీ కార్యకర్తలకు వివరిస్తానని ఆదాల తెలిపారు.  

హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా టికెట్ దక్కడంతో ఆయన ఎన్నికల ప్రచారం సైతం చేపట్టారు. 

అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అసమ్మతితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన గత రెండు రోజులుగా ముభావంగా ఉన్నారు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా స్థానిక నేతలు సహాయనిరాకరణ చెయ్యడంతో ఆయన పార్టీ మరాలని నిర్ణయించుకున్నారు. 

గత 10 రోజుల క్రితం నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఐదు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన టీడీపీలోని అసమ్మతితో వెనక్కి తగ్గారు. రెండురోజులుగా ఎన్నికల ప్రచారం చెయ్యకుండా ఇంటికే పరిమితమయ్యారు. 

శుక్రవారం మధ్యాహ్నాం అలా వచ్చి ఓ మెరుపు మెరిపించి హైదరాబాద్ పయనమయ్యారు. సీన్ కట్ చేస్తే శనివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపోతే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు పార్లమెంట్ కు లేదా కావలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, వంగాగీత: కండువాకప్పిన వైఎస్ జగన్

 

click me!