జగన్ బెయిల్ రద్దు చేయండి: ఈసీకి టీడీపీ వినతి

Published : Mar 27, 2019, 06:17 PM IST
జగన్ బెయిల్ రద్దు చేయండి: ఈసీకి టీడీపీ వినతి

సారాంశం

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐని కోరాలని ఈసీని కోరినట్టుగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని కూడ ఆయన చెప్పారు.  

అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐని కోరాలని ఈసీని కోరినట్టుగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని కూడ ఆయన చెప్పారు.

బుధవారం నాడు సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి బుద్దా వెంకన్న వినతి పత్రం సమర్పించారు. జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో అలజడులు చేసేందుకు కుట్రలకు జగన్ పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. బెయిల్‌పై ఉన్న జగన్, విజయసాయిరెడ్డిలు టీడీపీ నేతలపై, పోలీసులపై వీరంగం వేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బెయిల్‌పై ఉన్న వ్యక్తులు కొన్ని నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో  జగన్, విజయసాయిరెడ్డిలు బయట తిరగకూడదన్నారు.  జగన్  బెయిల్‌ను రద్దు చేయాలని రెండు రోజుల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని బుద్దా వెంకన్న ప్రకటించారు. వివేకానందరెడ్డి కూతురును కూడ భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు