టీడీపితో ప్రత్యక్ష పొత్తుకు పవన్ భయపడ్డారు: జగన్

By Nagaraju penumalaFirst Published Mar 27, 2019, 6:09 PM IST
Highlights

ఏ పార్టీ ముందుకు రాకపోతే చివరకు పెయిడ్‌ యాక్టర్‌, చంద్రబాబు పార్ట్‌నర్‌ పవన్ కళ్యాణ్ ఇండైరెక్టర్ గా పొత్తుపెట్టుకున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలు నమ్మడం లేదని తెలిసి ఢిల్లీ నుంచి తెచ్చుకుని వారితో చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నారంటూ జగన్ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే తనపై 22 కేసులు పెట్టించారని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 

ముమ్మిడివరం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునేందుకు పార్టీలు సైతం భయపడుతున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ చంద్రబాబు నాయుడు ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా పోటీ చెయ్యలేదని తెలిపారు. 

ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉండడంతో టీడీపీతో ప్రత్యక్షంగా పొత్తుపెట్టుకునేందుకు రాష్ట్రంలో ఏ పార్టీ ముందుకు రావడంలేదని విమర్శించారు. ఏ పార్టీ ముందుకు రాకపోతే చివరకు పెయిడ్‌ యాక్టర్‌, చంద్రబాబు పార్ట్‌నర్‌ పవన్ కళ్యాణ్ ఇండైరెక్టర్ గా పొత్తుపెట్టుకున్నారని ఆరోపించారు. 

ఏపీ ప్రజలు నమ్మడం లేదని తెలిసి ఢిల్లీ నుంచి తెచ్చుకుని వారితో చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నారంటూ జగన్ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే తనపై 22 కేసులు పెట్టించారని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 

పాదయాత్రలో ఈ నియోజకవర్గంలో విన్న సమస్యలు గుర్తున్నాయని తెలిపారు. గుజరాత్‌  స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ వల్ల 17 వేల మత్స్యకార కుటుంబాల జీవితాలు గందరగోళానికి గురయ్యాయని ఆరోపించారు. 

ఒక్కొరికి రూ. 6750 చొప్పున 17నెలలు ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం 6నెలల మాత్రమే చెల్లించారని మండిపడ్డారు. మిగిలిన 11 నెలలలో రూ.130కోట్లు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదన్నారు. 

గోదావరినది పక్కనే ఉన్నా తాగడానికి నీళ్లు లేవని విమర్శించారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర లేదన్నారు. మద్దతు ధర క్వింటాల్ కు రూ.1750 ఉన్నా రూ. 1250నుంచి మించి రావడం లేదన్నారు. 

పంటచేతికొచ్చే సమయానికల్లా దళారీల దోపిడి మొదలవుతుందన్నారు వైఎస్ జగన్. పురాణాలలో రాక్షసుల గురించి విన్నామని కానీ నారాసురుడు పాలన చూస్తున్నామంటూ విరుచుకుపడ్డారు.  

రావణాసురుడికి 10తలలు ఉంటే మన రాష్ట్రాన్ని పాలించే నారాసురుడికి వేర్వేరుగా తలలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుకి ఒక తల తన నెత్తిపై ఉంటుందని ఇంకొక తల పెయిట్ యాక్టర్, పార్ట్నర్ర పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు. మిగిలిన తలలు ఎల్లోమీడియా రూపంలో ఉంటాయంటూ ధ్వజమెత్తారు. 

వైసీపీ మాదిరి కండువా ఉండే వారి రూపంలో ఒక తల, డిల్లీ రూపంలో మరొక తల ఉంటుందని విమర్శించారు. చంద్రబాబు పాలనపై చర్చ జరగకూడదనేది ఈ పదితలల నారాసురుడి లక్ష్యమంటూ చెప్పుకొచ్చారు. 

ఒకవేళ చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే  టీడీపీకి డిపాజిట్లు రావన్నారు. అందుకే చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. 2014లో బాబు ఇచ్చిన హామీలపై చర్చ జరగకూండా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

వీళ్లే హత్యలు చేయిస్తారు. వీళ్ల పోలీసులతోటే విచారణ చేయిస్తారంటూ ధ్వజమెత్తారు. వీరి పాలన దారుణంగా ఉండటంతో ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు వీళ్లు రోజుకో పుకార్లు పుట్టిస్తారు. రోజుకో పొత్తులు పెట్టుకుంటారన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రతీ పథకంలోనూ అవినీతి ఉందని ఆరోపించారు. 

 

click me!