హోదా కోసం పోరాడితే నాపై 22 కేసులు, పవన్ పై లేవు: వైఎస్ జగన్

By Nagaraju penumalaFirst Published Mar 27, 2019, 6:16 PM IST
Highlights

చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ ఐదేళ్లలో తనపై 22కేసులు పెట్టారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. రాజధాని భూముల విషయంలో అక్కడి రైతులకు అండగా ఉన్నందుకు 8కేసులు, హోదా కోసం ధర్నా చేస్తే 4 కేసులు పెట్టించారని స్పష్టం చేశారు. ఇలా తనపై 22 కేసులు పెట్టించారని జగన్ చెప్పుకొచ్చారు. ఇదే చంద్రబాబు తన యాక్టర్‌, పార్ట్‌నర్‌ మీద ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. 
 

ముమ్మిడివరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం పోరాడితే తనపై 22 కేసులు పెట్టించారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వైఎస్ జగన్ తనపై కేసులు పెడతారని పార్ట్నర్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మాత్రం ఏ కేసులు ఉండవన్నారు. 

పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ యాక్టర్ అంటూ ధ్వజమెత్తారు. తన పార్ట్‌నర్‌ చాలా బాగా మాట్లాడుతున్నాడని చంద్రబాబు పొగుడుతాడని ఆ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తే ఆ నామినేషన్‌లో తెలుగు దేశం జెండాలే కనిపిస్తాయంటే ఎంతలా కుమ్మక్కు అయ్యారో గమనించాలని కోరారు. 

ఇదే యాక్టర్‌ నాలుగేళ్ల చంద్రబాబుతో కలిసి కాపురం చేశాడని తీరా ఎన్నికలు వచ్చేసరికి విడాకులు తీసుకున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నాడని ధ్వజమెత్తారు. పోరాటాలు చేస్తున్నట్లు నటిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ ఐదేళ్లలో తనపై 22కేసులు పెట్టారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. 

రాజధాని భూముల విషయంలో అక్కడి రైతులకు అండగా ఉన్నందుకు 8కేసులు, హోదా కోసం ధర్నా చేస్తే 4 కేసులు పెట్టించారని స్పష్టం చేశారు. ఇలా తనపై 22 కేసులు పెట్టించారని జగన్ చెప్పుకొచ్చారు. ఇదే చంద్రబాబు తన యాక్టర్‌, పార్ట్‌నర్‌ మీద ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. 

చంద్రబాబు మీద ప్రజావ్యతిరేకత ఎలా ఉంది అంటే  చివరకు తన పార్ట్‌నర్‌‌, యాక్టర్‌తో డైరెక్టుగా ముందు ఉండి పొత్తు పెట్టుకోలేని పరిస్థితి అంటూ మండిపడ్డారు. గొప్పపాలన చేస్తే ఇది నా అభివృద్ధి అని చెప్పి ఓట్లు అడగాలి కానీ చంద్రబాబు అలా చేయడం లేదన్నారు. 

ప్రజావ్యతిరేకత విపరీతంగా ఉండడంతో ఇక్కడి నాయకులు వద్దని ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారని విమర్శించారు. ఫరూక్‌ అబ్దుల్లాను తెచ్చుకుని తనపై తప్పుడు ప్రచారం చేయించారంటూ జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గరుకు వచ్చేసరికి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తారని వైఎస్ జగన్ మండిపడ్డారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపితో ప్రత్యక్ష పొత్తుకు పవన్ భయపడ్డారు: జగన్

click me!