వైసీపీని కేసీఆర్ కు దత్తత ఇచ్చిన జగన్: బుద్దా వెంకన్న

Published : Apr 04, 2019, 01:41 PM IST
వైసీపీని కేసీఆర్ కు దత్తత ఇచ్చిన జగన్: బుద్దా వెంకన్న

సారాంశం

మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నట్లు జగన్ ఆస్తులు కేసీఆర్ గుప్పిట్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ చెప్పిన వారిపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మెున్న ఉగ్రనరసింహారెడ్డి, నిన్న పుట్టా సుధాకర్ యాదవ్ లపై దాడులు జరిగాయని స్పష్టం చేశారు.   

అమరావతి: రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఓటేస్తే ప్రజలు కరెంట్ తీగపట్టుకున్నట్లేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ కు ఓటేయోద్దని ఓటేస్తే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందన్నారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న వైఎస్ జగన్, కేసీఆర్ లపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సీఎం కేసీఆర్ కు దత్తత ఇచ్చేశారని ఆరోపించారు. 

అందువల్లే కేసీఆర్ ఏపీకి కోట్లాది రూపాయలు పంపి జగన్ ను గెలిపించుకోవాలని తహతహలాడుతున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్ ఎందుకు కోట్లాది రూపాయలు జగన్ కు పంపిస్తున్నారో తెలంగాణ ప్రజలు నిలదీయాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణలో జగన్ ఓదార్పు యాత్రకు వెళ్తే కేసీఆర్ తరిమికొట్టించారని గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకే జగన్ కేసీఆర్ చెప్పినట్లు ఆడుతున్నారని విమర్శించారు. 

మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నట్లు జగన్ ఆస్తులు కేసీఆర్ గుప్పిట్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ చెప్పిన వారిపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మెున్న ఉగ్రనరసింహారెడ్డి, నిన్న పుట్టా సుధాకర్ యాదవ్ లపై దాడులు జరిగాయని స్పష్టం చేశారు. 

గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై ఐటీ దాడులు జరిగాయని కానీ ఇప్పుడు మాత్రం జరగవన్నారు. వేల కోట్లు అవినీతికి పాల్పడ్డ వైఎస్ జగన్ పై గానీ, బ్రదర్ అనిల్ కుమార్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులపై ఎందుకు ఐటీ దాడులు జరగడం లేదో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 

మోదీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉండటం సిగ్గుచేటన్నారు. దేశం మొత్తం ఎన్నికలు జరుగుతుంటే మోదీ మాత్రం చంద్రబాబునే టార్గెట్ చేశారని ధ్వజమెత్తారు. అలాంటి మోదీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం ఉందని జగన్ వత్తాసు పలకడం చూస్తుంటే వారి మధ్య ఎంత అండర్ స్టాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చని బుద్దా వెంకన్న ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు