జనసేనకు చిరంజీవి ప్రచారంపై పవన్ కల్యాణ్ మాట ఇదీ...

By Nagaraju penumalaFirst Published Apr 4, 2019, 12:53 PM IST
Highlights

తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి మద్దతుగాప్రచారం చేసే అవకాశం లేదన్నారు. ఆయన పొలిటికల్ కన్‌క్లూజన్ తీసేసుకున్నారని తెలిపారు. పాలిటిక్స్‌ను నేను చూసే విధానం వేరు, చిరంజీవి చూసే విధానం వేరని తెలిపారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది. అటు సినీనటుడుగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం అషామాషీ కాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినీనటుడిగా, రాజకీయ వేత్తగా ప్రజలు ఆయనపై ప్రత్యేక ఆదరణ చూపిన విషయం తెలిసిందే.  

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కాంగ్రెస్ పార్టీలో విలీనం చెయ్యడం   అందరికీ తెలిసిందే. దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి తన సోదరులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నరసాపురం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి నాగబాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. 

చిరంజీవి ఎన్నికల ప్రచారంపై చిరు అభిమానులు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. అదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే అన్నయ్య చిరంజీవి ఎన్నికల ప్రచారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. 

ఓ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి మద్దతుగాప్రచారం చేసే అవకాశం లేదన్నారు. ఆయన పొలిటికల్ కన్‌క్లూజన్ తీసేసుకున్నారని తెలిపారు. 

పాలిటిక్స్‌ను నేను చూసే విధానం వేరు, చిరంజీవి చూసే విధానం వేరని తెలిపారు. ఆ విషయంలో తమ ఇద్దరి మధ్య స్పష్టత ఉందన్నారు. ప్రస్తుతానికి చిరంజీవి కళాకారుడు తాను కళాకారుడిని కాదు అంతే తేడా అన్నారు. 

ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పెద్ద ఎత్తున నేతలు వచ్చారని కానీ జనసేనకు మాత్రం అలా తరలిరాలేదన్నారు. ప్రజారాజ్యం పార్టీకి ఉన్న నేతలు కానీ జనసేనకు ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. జనసేన పార్టీకి మెుత్తం తానై వ్యవహరించాల్సి వస్తోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

click me!