అనధికారికంగా ఏబీ వెంకటేశ్వరరావు విధులు, హైకోర్టులో వైసీపీ పిటిషన్

By narsimha lodeFirst Published Apr 4, 2019, 12:43 PM IST
Highlights

ఎన్నికల విధుల నుండి తప్పించినా కూడ ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అనధికారికంగా కొనసాగుతున్నారని  ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా చేసింది హైకోర్టు.
 


అమరావతి:ఎన్నికల విధుల నుండి తప్పించినా కూడ ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అనధికారికంగా కొనసాగుతున్నారని  ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా చేసింది హైకోర్టు.

మూడు రోజుల క్రితం ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం నాడు హైకోర్టు విచారణకు స్వీకరించింది.  అనధికారికంగా ఈ పోస్టులోనే ఏబీ వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారని నాగిరెడ్డి ఆరోపించారు.

కిందిస్థాయి ఉద్యోగులు ఇంకా కూడ ఏబీ వెంకటేశ్వరరావుకు నివేదికలు ఇస్తున్నారని ఆయన  ఆ పిటిషన్‌లో ఆరోపించారు.  ప్రభుత్వం ఇంకా కూడ ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతు తెలుపుతోందని ఆయన ఆరోపించారు.సీఈసీ ఆదేశాలు జారీ చేసినా కూడ ఏబీ వెంకటేశ్వరరరావు అనధికారికంగా కొనసాగుతున్నారని నాగిరెడ్డి ఆరోపించారు.

click me!