జర్నలిస్ట్ పై దాడి: హీరో బాలకృష్ణ క్షమాపణలు

By Nagaraju penumalaFirst Published Mar 28, 2019, 7:12 AM IST
Highlights

ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ఉన్న చిన్నపిల్ల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరి మూకల పని అని భావించి వారిని వారించడం జరిగిందని స్పష్టం చేశారు. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసిందన్నారు. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధకలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. 
 

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో జర్నలిస్ట్ పై ఎమ్మెల్యే సినీనటుడు నందమూరి బాలకృష్ణ చెయ్యి చేసుకున్న ఘటనపై స్పందించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ఉన్న చిన్నపిల్ల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరి మూకల పని అని భావించి వారిని వారించడం జరిగిందని స్పష్టం చేశారు. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసిందన్నారు. 

అంతేకానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధకలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. 

ఇకపోతే బుధవారం హిందూపురం నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో జర్నలిస్ట్ పై చెయ్యిచేసుకున్నారు బాలకృష్ణ. ప్రాణాలు తీస్తా అంటూ ఒంటికాలిపై లేచారు. ఇష్టం వచ్చినట్లు బూతుపురాణం చదివారు. 

వివరాల్లోకి వెళ్తే హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే బాలకృష్ణకు ఎదురుగా చిన్నపిల్లలు వస్తుండటంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది వారిని పక్కకు లాగిపడేశారు. ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధి షూట్ చేశారు. ఆ విషయాన్ని గమనించిన బాలకృష్ణ ఆ ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. 

కెమెరాలో చిత్రీకరించిన దృశ్యాలను డిలీట్ చెయ్యాలని తిట్టిపోశారు. ఆగ్రహంతో చెయ్యి కూడా చేసుకున్నారు. రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగులుపెడతాను, ప్రాణాలు తీస్తాను. 

బాంబులు వేయడం​ కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు అంటూ బాలయ్య బెదిరింపులకు పాల్పడ్డారు. జనం పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో బాలకృష్ణ తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి అక్కడ నుంచి ఉడాయించారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

రాస్కెల్! మా బతుకులు మీచేతుల్లో ఉన్నాయిరా, నరికేస్తా: జర్నలిస్ట్ ను కొట్టిన బాలకృష్ణ

click me!