కోర్టుకు వెళ్లారుగా, అక్కడే తేల్చుకుందాం: టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్

By Nagaraju penumalaFirst Published Mar 27, 2019, 9:09 PM IST
Highlights


ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీల తీరును నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖను అందజేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమించి వ్యవహరించిందని సిఈసీకి స్పష్టం చేసినట్లు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు బయటికొస్తాయన్న భయంతోనే విచారణ నుంచి పోలీసులను తప్పించాలని చూశారని ఆయన ఆరోపించారు.

ఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తారా అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరాను నిలదీశారు టీడీపీ నేతలు. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేష్ తోపాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ లు కలిశారు. 

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీల తీరును నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖను అందజేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమించి వ్యవహరించిందని సిఈసీకి స్పష్టం చేసినట్లు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. 

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు బయటికొస్తాయన్న భయంతోనే విచారణ నుంచి పోలీసులను తప్పించాలని చూశారని ఆయన ఆరోపించారు. ఈనెల 25 న ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేస్తే 26న కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 

మరోవైపు ఎన్నికల కమిషన్ పాత్ర అనుమానాస్పదంగా ఉండరాదని, తన పరిధులు దాటి వ్యవహరించరాదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ సూచించారు. టీడీపీపై  ఎన్నికల కమిషన్ కక్ష కట్టిందని ఆరోపించారు. 

ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కూడా చేయకుండా ఎలా చర్యలు తీసుకుంటారని మండిపడ్డారు. వైసీపీ తన ఫిర్యాదులో కడప ఎస్పీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని అయితే ఆయనను ఎందుకు బదిలీ చేశారో చెప్పమంటే సమాధానం చెప్పలేదని వాపోయారు. బదిలీల విషయం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కోర్టులోనే తేల్చుకుందామని సునీల్ అరోరా చెప్పారని జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. 
 

click me!