పాతవాసనలు.. ఎదరు పార్టీలకు జైకొట్టిన అభ్యర్థులు

By ramya NFirst Published Apr 9, 2019, 4:15 PM IST
Highlights

ఎన్నికల వేళ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేయడం చాలా సర్వసాధారణ విషయం. అప్పటి వరకు ఒక పార్టీలో ఉండి విమర్శలు గుప్పించిన వారే.. పార్టీ మారగానే వారితో కరచాలనం చేసేస్తారు. 

ఎన్నికల వేళ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేయడం చాలా సర్వసాధారణ విషయం. అప్పటి వరకు ఒక పార్టీలో ఉండి విమర్శలు గుప్పించిన వారే.. పార్టీ మారగానే వారితో కరచాలనం చేసేస్తారు. అందుకోనేమో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు అనే నానుడి కూడా ఉంది.

ఈ సంగతి పక్కన పెడితే... కొందరు నేతలు పార్టీలు మారినా.. తమ పాత పార్టీ తాలూకు స్మృతులను మాత్రం మర్చిపోలేకపోతున్నారు. ప్రస్తుత పార్టీకి కొట్టాల్సిన జైని.. పాత పార్టీ నేతలకు  కొట్టి అడ్డంగా బుక్కైపోతున్నారు. 

వారం రోజుల క్రితం నామా నాగేశ్వరరావు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. మొన్నటి వరకు ఆయన టీడీపీ నేతగా ఉండి.. ఇటీవలే టీఆర్ఎస్ లో చేరారు. కారు ఎక్కినా కూడా సైకిల్ ని మర్చిపోలేకపోయారు. మరో నేత సండ్ర కూడా నామా బాటలోనే నడిచి సైకిల్ కి ఓటు వేయమని చెప్పారు. ఆయన కూడా ఇటీవలే టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

ఈ సీన్ కేవలం తెలంగాణ ఎన్నికల్లో మాత్రమే కాదు.. ఏపీ ఎన్నికల ప్రచారంలోనూ కనపడింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన గౌరు చరితా రెడ్డి.. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే.. ఆమె జగన్ గూటిని వదిలి... చంద్రబాబు గూటికి చేరిన విషయాన్ని ఎన్నికల ప్రచారంలో మర్చిపోయారు. తనకు ఓటు వేయాలని ప్రజలను కోరి.. వెను వెంటనే జై జగన్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

వీరంతా.. ఇటీవల పార్టీ మారారు కాబట్టి ఆ మాత్రం తడబడ్డారని అనుకోవచ్చు. కానీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి టీడీపీ పంచన చేరి ఐదేళ్లు అవుతోంది. అయినా ఆయన ఇంకా కాంగ్రెస్ ని మరవలేదు. కొడుకు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... కాంగ్రెస్ కి ఓటు వేయమని ప్రజలను కోరారు.


వెంటనే పొరపాటును గ్రహించి దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం  చేశారు. తనకు ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ చావలేదంటూ.. ప్రజలకు వివరణ ఇచ్చారు. 

related news

పాత వాసన: నామా అలవాటులో పొరపాటు (వీడియో)

మొన్న నామా.. నేడు సండ్ర.. ఇంకా ‘సైకిల్’ ని మర్చిపోలేదు

టీడీపీ ప్రచారంలో జగన్ కి జై కొట్టిన గౌరు చరిత

ఎన్నికల ప్రచారంలో..చంద్రబాబుకి షాక్ ఇచ్చిన జేసీ
 

click me!