
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం నుంచి ఊహించని షాక్ తగిలింది. ముద్రగడను ఉపయోగించుకొని కాపు ఓట్లను మరిన్ని తమవైపు తిప్పుకునేందుకు పవన్ వేసిన ప్లాన్ రివర్స్ అయ్యింది.
ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్.. ముద్రగడకు ఫోన్ చేశారట. తాను వచ్చి కలవాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పారట. అయితే.. తాను ఇప్పుడు కలవనని.. కవాలంటే ఎన్నికల తర్వాత కలుస్తానని ముద్రగడ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో తాను, తన కొడుకు పోటీ చేయడం లేదని.. కాబట్టి ఏ పార్టీకి మద్దతుగా కూడా ప్రచారం చేయమని ముద్రగడ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ముద్రగడ నుంచి ఈ సమాధానం ఆశించని పవన్ ఒక్కసారిగా షాకయ్యారంట.
మళ్లీ ఆ షాక్ నుంచి తేరుకొని రెండు రోజులు ఆగి మరోసారి ఫోన్ చేశారని సమాచారం. ముద్రగడ భార్య ఆరోగ్యం గురించి ఆరాతీసి.. మరోసారి తాను ఇంటికి రావాలని అనుకుంటున్నట్లు చెప్పాడట. మరోసారి కూడా ముదగ్రడ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ముద్రగడకు టీడీపీ నుంచి పిఠాపురం టికెట్ ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దానిని కూడా ఆయన తిరస్కరించారు. మొత్తం గా ముద్రగడకు పవన్, చంద్రబాబులపై కోపం ఇంకా ఉన్నట్లు అర్థమౌతోంది. ఈ విధంగా ముద్రగడ వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారనే సమాధానం వినపడుతోంది.