కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య: జనసేన మేనిఫెస్టో హామీలివే

Published : Apr 03, 2019, 11:24 AM IST
కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య: జనసేన మేనిఫెస్టో హామీలివే

సారాంశం

కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్టు జనసేన ప్రకటించింది. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.8వేలను ఇవ్వనున్నట్టు ఆ పార్టీ హామీ ఇచ్చింది

హైదరాబాద్:  కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్టు జనసేన ప్రకటించింది. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.8వేలను ఇవ్వనున్నట్టు ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఏపీ ప్రజలకు జనసేన వరాలను ప్రకటించింది. 

బుధవారం నాడు జనసేన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలకు ఏం చేయనున్నామనే విషయాన్ని మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రకటించింది.

ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రల వారీగా చేపట్టనున్న అభివృద్ధి గురించి మేనిఫెస్టోలో  ఆ పార్టీ వివరించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందిస్తామని ప్రకటించింది. గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ బదులుగా  మహిళల ఖాతాల్లో రూ. 2500 నుండి రూ.3500  చెల్లించనున్నట్టు జనసేన ప్రకటించింది.

ఉద్యోగులకు సీపీఎస్ రద్దు వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. మొత్తం 96 హామీలను జనసేన పొందుపర్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని జనసే ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు