టఫ్: మేకపాటి, బొల్లినేనిల మధ్య హోరాహోరీ

Published : Apr 03, 2019, 10:53 AM ISTUpdated : Apr 03, 2019, 10:58 AM IST
టఫ్: మేకపాటి, బొల్లినేనిల మధ్య హోరాహోరీ

సారాంశం

నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటా పోటీ నెలకొంది.  గత ఎన్నికల్లో ఇదే స్థానం నుండి  వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో విజయం సాధించిన బొల్లినేని రామారావును టీడీపీ మరోసారి బరిలోకి దించింది.

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటా పోటీ నెలకొంది.  గత ఎన్నికల్లో ఇదే స్థానం నుండి  వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో విజయం సాధించిన బొల్లినేని రామారావును టీడీపీ మరోసారి బరిలోకి దించింది.

కడప, ప్రకాశం జిల్లాలకు  ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం సరిహద్దుల్లో ఉంటుంది. ఈ ప్రాంతమంతా కరువు ప్రాంతం.ఈ ప్రాంతం ఎప్పుడూ కరువుకు గురౌతోంది. దీంతో ఉపాధి కోసం ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలసవెళ్తుంటారు.1978లో ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనతా పార్టీ టిక్కెట్టుపై విజయం సాధించారు.

నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడ ఇదే అసెంబ్లీ స్థానం నుండి  గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి  1985లో విజయం సాధించారు.1999 ఎన్నికల్లో ఈ స్థానం నుండి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి కె. విజయరామిరెడ్డి చేతిలో ఓటమి చెందాడు

2004, 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు.2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఇదే స్థానం నుండి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు.

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఇదే నియోజకవర్గంలో  ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతోంది. దీంతో  ఈ నియోజకవర్గంలో ఆయనకు బాగా కలిసివచ్చే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

2014 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన చిరంజీవి రెడ్డి ఈ ఎన్నికల్లో వైసీపీలో చేరారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలుపు కోసం  ఆయన పనిచేస్తున్నాడు.

సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు వ్యతిరేకంగా కొంతకాలంగా ప్రత్యర్థులు చేసిన ప్రచారం ఆయనకు ఇప్పుడు ఇబ్బంది కల్గించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మహారాష్ట్రలోని విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ లో బొల్లినేని రామారావు కం.పెనీ నిర్వహించిన కాంట్రాక్టులకు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి.ఈ విషయమై ఏసీబీ కూడ కేసులు నమోదు చేసింది.

అయితే ఈ ఆరోపణలపై మహారాష్ట్ర ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు.ఈ విషయంలో బొల్లినేని రామారావు కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని  తేల్చి చెప్పారు.  అయితే మహారాష్ట్రలో ఏసీబీ అధికారుల కేసు గురించి బొల్లినేని రామారావుపై ప్రత్యర్తులు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకొంటున్నారు.

ఈ స్థానానికి టీడీపీ తన అభ్యర్ధిని ప్రకటించడానికి ఆలస్యం చేయడానికి ఇది కూడ ఒక కారణంగా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.  దీనికితోడు మరో ఇద్దరు అభ్యర్థులు కడూ ఈ స్థానం నుండి పోటీకి సిద్దం కావడం కారణంగా చెబుతున్నారు.

అయితే ఈ స్థానం నుండి టిక్కెట్టు ఆశించిన ఇద్దరు నేతలు కూడ మనస్పూర్తిగా బొల్లినేని రామారావుకు సహకరిస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.మరోవైపు  టీడీపీ, వైసీపీ అభ్యర్థులతో పాటు జనసేన నుండి గుడిపల్లి భరత్‌కుమార్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు