మా అభ్యర్థులను కేసీఆర్ బెదిరిస్తున్నారు: లోకేష్

By narsimha lodeFirst Published Apr 1, 2019, 11:18 AM IST
Highlights

ఏపీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏం పని అని ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్ధులను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
 

అమరావతి: ఏపీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏం పని అని ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్ధులను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఆదివారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన ప్రకటించారు. ఏపీ రాష్ట్రంలో జగన్‌ను గెలిపించేందుకు టీఆర్ఎస్ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు బూచిని చూపి సెంటిమెంట్‌ను రగిల్చి కేసీఆర్ విజయం సాధించాడని  ఆయన గుర్తు చేశారు. ఏపీలో టీఆర్ఎస్‌ పోటీ చేయడం లేదన్నారు. కానీ, పరోక్షంగా వైసీపీకి సహకరిస్తోందని ఆయన చెప్పారు.

తమ పార్టీకి చెందిన అభ్యర్ధులకు కేసీఆర్ ఫోన్ చేస్తున్నాడని లోకేష్ చెప్పారు. అంతేకాదు వైసీపీకి కేసీఆర్ ప్రచార రథాలను కూడ పంపారని ఆయన ఆరోపించారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మద్దతు ఇస్తామని కేసీఆర్ ఏనాడూ ప్రకటించారో చెప్పాలని ఆయన జగన్‌ను డిమాండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు కూడ ఇవ్వాలని కూడ టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రకటనలను ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ వేదికగా ప్రత్యేక హోదాకు మద్దతు పలికినట్టుగానే కవిత మాట్లాడి బయట మాత్రం ఆ విషయాన్ని వ్యతిరేకించిందన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పని చేయనందున సెంటిమెంట్ పనిచేసిందని చెప్పారు. కానీ, ఏపీ రాష్ట్రంలో తాము పెద్ద ఎత్తున అభివృద్ధి  చేసినట్టు చెప్పారు. తాము చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేకపోతే టీఆర్ఎస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

టీడీపీ గెలుచుకోలేని సీటు కావాలన్నా, బాబు ఇచ్చేశాడు: లోకేష్

 

click me!