టీడీపీ గెలుచుకోలేని సీటు కావాలన్నా, బాబు ఇచ్చేశాడు: లోకేష్

By narsimha lodeFirst Published Apr 1, 2019, 11:03 AM IST
Highlights

టీడీపీ బలహీనంగా అసెంబ్లీ స్థానంలో తనను పోటీకి దింపాలని చంద్రబాబునాయుడును కోరానని... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.


అమరావతి: టీడీపీ బలహీనంగా అసెంబ్లీ స్థానంలో తనను పోటీకి దింపాలని చంద్రబాబునాయుడును కోరానని... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. తన ప్రతిపాదన మేరకే చంద్రబాబునాయుడు మంగళగిరి అసెంబ్లీ సీటును తనకు కేటాయించారని ఆయన ప్రకటించారు.

ఆదివారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.టీడీపీ ప్రచార సభలకు భారీగా ప్రజలు వస్తున్నారని ఆయన చెప్పారు. మహిళలు పెద్ద ఎత్తున తమ ప్రచార సభలకు వస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

టీడీపీ గెలుచుకోలేని సీటును తనకు కేటాయించాలని చంద్రబాబును కోరితే మంగళగిరి సీటును తనకు చంద్రబాబునాయుడు కేటాయించారని ఆయన చెప్పారు.1985 తర్వాత మంగళగరి అసెంబ్లీ సీటులో టీడీపీ విజయం సాధించలేదని ఆయన వివరించారు.  మంగళగిరి సీటును టీడీపీ కంచుకోటగా తీర్చిదిద్దనున్నట్టు ఆయన  ధీమాను వ్యక్తం చేశారు.

మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ళ రామకృష్ణారెడ్డి గత ఐదేళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్నారని  ఆయన గుర్తు చేశారు. తాను మంగళగిరి నియోజకవర్గంలోనే ఉంటానని ఆయన చెప్పారు.

ఎన్నికల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి రోజు రెండు గంటలను ప్రజల కోసం కేటాయిస్తానని ఆయన తెలిపారు. మంగళగిరిలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  

కుప్పం నియోజకవర్గానికి చెందిన వారెవరైనా కూడ చంద్రబాబునాయుడును కలిసేందుకు వస్తే ఎలాంటి ఆటంకాలు ఎదురుకాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వారు కూడ తనను కలిసేందుకు రావాలనుకొంటే కూడ అదే విధంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన వివరించారు.

click me!