కుప్పం కార్యకర్తలతో నారా భువనేశ్వరి టెలీకాన్ఫరెన్స్

Published : Apr 03, 2019, 11:27 AM IST
కుప్పం కార్యకర్తలతో నారా భువనేశ్వరి టెలీకాన్ఫరెన్స్

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి  రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. 


టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి  రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె హెరిటేజ్  కంపెనీ బాధ్యతలు మాత్రమే  చూసుకునేవారు. తొలిసారిగా ఆమె రాజకీయాల్లోనూ చురుకుదనం చూపిస్తున్నారు.

టీడీపీ తిరిగి అధికారంలోకి రావాలనే కాంక్షతో చంద్రబాబు సహా పార్టీ నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే..  దీనిలో నారా భువనేశ్వరి కూడా భాగం అయ్యారు.

చంద్రబాబు మొదటి నుంచి కుప్పం నుంచే ఎన్నికల బరిలో దిగుతున్నారన్న విషయం తెలిసిందే. కాగా.. చంద్రబాబును తిరిగి సీఎం చేయాలని ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని భువనేశ్వరి కుప్పం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో 2వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి 75శాతం ఓట్లతో డిస్టింక్షన్‌లో చంద్రబాబును పాస్‌ చేయించాలని, ప్రజలతో మమేకం కావాలి.. అతివిశ్వాసం వద్దని కార్యకర్తలకు భువనేశ్వరి సూచించారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు