శ్రీకాకుళంలో భారీగా నగదు పట్టివేత

By ramya NFirst Published Apr 5, 2019, 12:39 PM IST
Highlights

ఎన్నికల వేళ శ్రీకాకుళం జిల్లాలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా రాజాం వస్తున్న ఆర్టీసీ బస్సులో డబ్బు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేపట్టారు.  

ఎన్నికల వేళ శ్రీకాకుళం జిల్లాలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా రాజాం వస్తున్న ఆర్టీసీ బస్సులో డబ్బు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేపట్టారు.  

కాగా.. బస్సు దిగువ భాగంలోని లగేజీ క్యాబిన్ లో మూడు బ్యాగుల్లో నోట్ల కట్టలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.  వెంటనే బస్సుతో సహా అందులోని 23మంది ప్రయాణికులను పోలీసులు స్టేషన్ కి తరలించారు.

పాలకొండ డీఎస్పీ ప్రేమ్‌ కాజల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని బ్యాగులను పరిశీలించారు. రెవెన్యూ అధికారులకు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. మొత్తం తంతును చిత్రీకరించారు. మూడు లగేజీ బ్యాగుల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు తేలింది. మనీ కౌంటింగ్ మెషిన్స్ సహాయంతో ఆ నగదు లెక్కించే ఏర్పాట్లు చేశారు. బస్సులో రాజాం, పాలకొండ నియోజకవర్గాలను పర్యవేక్షించే వైసీపీ నేత ఉండటం గమనార్హం.

దీంతో ఆ నగదు వైసీపీ నేతలకు చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు బ్యాగుల్లో కలిపి రూ.1కోటి ఉన్నట్లు గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

click me!